నేను చూసిన స్టూడెంట్ లీడర్… ఇలాంటి వాళ్లు ఉండాలి బాస్.!

స్థలం: అంబర్ పేట్ -6 నెంబర్ —— ——సమయం: సాయంత్రం 6 గంటలకు.

రోడ్డు పక్కన ఓ 40 యేళ్ల మహిళ…గత 10 రోజులుగా అదే ప్లేస్ లో కూర్చొని ఉంటుంది. ఆమె వేసుకున్న బట్టలు  చినిగి ఉండడంతో వాటిల్లోంచి ఆమె లోపలి అవయవాలను చూస్తూ ఆనందిస్తున్నారు కొంత మంది కుర్రాళ్లు. అప్పుడే అక్కడ టీ తాగడానికి ఆగిన ఓ వ్యక్తి వీళ్ల మాటలు విని ఆశ్చర్యపోయాడు…వెంటనే పక్కనే ఉన్న షాప్ కు వెళ్లి ఓ జత బట్టలు కొన్నాడు…అవి తెచ్చి రోడ్డు మీద వెళుతున్న ఓ మహిళతో…  ఆ బట్టలను ఆమెకు తొడగాల్సిందిగా  రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు నిండు బట్టలతో ఆ మహిళకు  దండం పెట్టి…ఏ అమ్మా ఏమైనా తిన్నావా? అని అడిగి ఆమెను పట్టుకొని హోటల్ వైపుగా తీసుకొచ్చాడు ఆ వ్యక్తి….ఇంతలో ఇక్కడి నుండి అదంతా చూస్తున్న కుర్రాళ్ళు  పరార్ అయ్యారు.ఆమెకు కడుపు నిండా తినిపించి….ఆమె గురించి వాకాబు చేశాడు. ఏదో గొడవల కారణంగా ఇంటి నుండి వచ్చినట్టు తెలుసుకున్నాడు .ఆమె పరిస్థితిని గమనించిన సదరు వ్యక్తి…..ఏదైనా పనిచేస్తావా? అని అడిగాడు. చేస్తా అని చెప్పడంతో ఆమెను తీసుకెళ్లి తనకు తెల్సిన ఓ కాలేజ్ లో అటెండర్ గా జాయిన్ చేయించి…1000/- రూపాయలు ఆమె చేతిలో పెట్టి వచ్చేశాడు.

459915633

స్థలం: ఇందిరా పార్క్—————–సమయం: మద్యాహ్నం 2  గంటలు:

ప్రభుత్వం వెంటనే DSC ని నిర్వహించాలి…నిరుద్యోగుల ఐక్యత వర్థిల్లాలి…..అనే నినాదాలు  జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది….అన్నా మా అమ్మకు సీరియస్ గా ఉంది అర్జెంట్ గా 5 యూనిట్ల  రక్తం కావాలట ICU లో ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు..అంటూ  వణుకుతన్న వాయిస్ తో ఓ అమ్మాయి ఆవేదన… 30 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి తనతో పాటు నలుగురు  కుర్రాళ్లను తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ లో బ్లెడ్ ఇచ్చి వచ్చి…మళ్లీ ధర్నాలో కూర్చొని నినాదాలు చేస్తున్నాడు…నిరుద్యోగుల ఐక్యత వర్థిల్లాలి…… DSC ని వెంటనే నిర్వహించాలి.!

13731587_1787048571532871_5549589204792178759_n

స్థలం: దిల్ సుఖ్ నగర్ —————–సమయం: ఉదయం 11  గంటలు:

అన్నా..నేను రాజేష్ ని….DSC కోచింగ్ లో జాయిన్ అవ్వడానికి వచ్చా…ఈ కోచింగ్ సెంటర్ లో ఫీజ్ చాలా ఎక్కువగా అడుగున్నారు. మా ఫ్యామిలీ గురించి నీకు తెల్సు కదా… అంతగా కట్టలేను. నువ్వొచ్చి ఓ సారి మాట్లాడు కాస్త తగ్గిస్తారేమో..? అని అదే వ్యక్తికి మరో ఫోన్.  ఓ గంట తర్వాత ఆ కుర్రాడిని తీసుకొని సదరు వ్యక్తి….కోచింగ్ సెంటర్ యాజమాన్యం దగ్గరికి వెళ్లాడు.. సార్..పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు …కాస్త హెల్ప్ చేయండి …ఫీజ్ తగ్గించండి అంటూ తన మాటగా ఆ  యాజమాన్యం వారికి విన్నవించాడు. లేదు బాస్ లేదు….మీ ఉస్మానియా నుండి చాలా మంది స్టూడెంట్ లీడర్స్ వస్తుంటారు. ఎంత మందికని ఇస్తాం….పైగా ఇలా వచ్చిన వారు కమీషన్స్ కూడా తీసుకుంటారని ఒకటే టాక్…అని అన్నాడు అ కోచింగ్ సెంటర్ డైరెక్టర్…. ఆ మాటకు అతనికి ఎక్కడో కలుక్కుమంది…తమ్ముడూ ఫీజ్ ఎంత ? 8000/- అన్నా. నీ దగ్గర ఎంతున్నాయ్?  5000/- అన్నా….ఇదిగో 3000/- కలిపి కట్టేయ్ అంటూ అక్కడే తన పర్స్ లోంచి తీసి ఏడు వేలు ఇచ్చేశాడు. షాక్ అయ్యాడు కోచింగ్ సెంటర్ డైరెక్టర్.

13592727_850243491786258_5501406255490803267_n

ఈ మూడు సన్నివేశాల్లో ఉన్నది ఓకే వ్యక్తి. అతని పేరు అల్వాల మధుసూధన్. B.Ed సంఘ రాష్ట్ర అద్యక్షుడిగా…తెలంగాణ రాష్ట్ర  నిరుద్యోగ సంఘ అధ్యక్షుడిగా నిరుద్యోగుల తరఫున, DSC అభ్యర్థుల  తరఫున పోరాడుతున్న స్టూడెంట్ లీడర్.  పొలిటికల్ అంశాలు పక్కకు పెడితే…… పై మూడు సన్నివేశాలలో అతని  సేవాభావం, మానవతా తత్వం మాత్రం నన్ను అమితంగా ఆకర్షించాయ్.  లీడర్ అంటే  వెనుక ఓ పదిమందు యువకుల గుంపు, ఖద్దరు బట్టలు…బెదిరిస్తూ మాట్లాడే నాలుగు బూతులు…. ఇలా కాకుండా…లీడర్ అనే మాటకు సరైన నిర్వచనాన్ని ఇస్తున్నాడు ఈ విద్యార్థి నాయకుడు .  ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఈయనను అందరూ మధన్నా..మధన్నా…అని పిలుచుకుంటారు. ఫోన్ చేసి అన్నా నాకు ఈ సహాయం కావాలంటే చాలు ….మనోడా? పక్కోడా అని చూడకుండా వెళ్లి హెల్ప్ చేస్తాడు అనే మంచి పేరును… దందా రాజకీయాలు చేయకుండా లక్ష్యం దిశగా ఉద్యమాన్ని నడిపిస్తాడనే నమ్మకాని పొందిన ఈ విద్యార్థి నాయకుడికి అభినందనలు.

Comments

comments

Share this post

scroll to top