ఆమె గెలిచింది, పరుగు పందెం తో పాటు, అందరి హృదయాలను….!?

 

డిసెంబర్ 22, హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లా లో పరుగు పందెం స్టార్ట్ అయ్యింది.  అమ్మాయిలంతా లైన్ లో నిలబడ్డారు, విజిల్ సౌండ్ వినిపించిది, పరుగు మొదలు పెట్టారు.. 9 వతరగతి చదువుతున్న  బక్షో దేవి అనే  ఓ అమ్మాయి శరవేగంతో పరుగులు తీస్తుంది…తన ముందున్న వారినందరినీ దాటుకుంటూ జెట్ స్పీట్ తో ఫైనల్ లైన్ ను టచ్ చేసింది. గమ్యాన్ని చేరుకున్నాక ఆ అమ్మాయి తన కాలి నుండి ధారలుగా కారుతున్న రక్తాన్ని ఓ ఖర్చీఫ్  తో తూడ్చుకుంటుంది. అప్పటి వరకు చప్పట్లతో మార్మోగిన స్టేడియానంతా ఒక్కసారిగా నిశ్శబ్ధ వాతావరణం ఆవహించింది.
రన్నింగ్ రేస్ కు వచ్చిన వాళ్లంతా  స్పోర్ట్ డ్రెస్, కాళ్లకు కంపెనీ షూస్ ధరించి మరీ రంగంలోకి దిగారు, కానీ బక్షోదేవి మాత్రం స్కూల్  డ్రెస్ తో,  కాళ్లకు షూస్ లేకుండా పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ సాధించింది.బూట్లు లేని కారణంగానే రాయి తగిలి కాలికి గాయం అయ్యి, రక్తం ధారలుగా కారసాగింది. అయితే ఇదంతా అయ్యాక ఫ్రైజ్ ఇచ్చేటప్పుడు ఆమె మాట్లాడుతూ…..మొదట నా వాలకాన్ని చూసి చాలా మంది నవ్వారు, తర్వాత నేను పరిగెత్తే క్రమంలో నా కాలి నుండి రక్తం కారడం చూసి చాలా మంది అయ్యో అని అనుకున్నారు , కానీ మీకు తెలియని ఇంకో విషయం అంటూ…… తనలోని అసలు బాధను వ్యక్తం చేసింది బక్షోదేవి.
నాకు కిడ్నీలో రాళ్లున్నాయ్..నేను పరిగెడుతున్న క్రమంలో వాటి కారణంగా నాకు నొప్పి తీవ్రమయ్యింది, కానీ నా లక్ష్యంముందు ఆ నొప్పి చిన్నదనిపించింది. అందుకే నాకు స్పూర్తి ప్రధాత అయిన PT ఉషను మనస్సులో తల్చుకొని మరింత వేగంగా లక్ష్యం వైపు పరిగెత్తా అంటూ అందరి ముందు చెప్పింది. దాంతో స్టేడియం అంతా జూనియర్ PT ఉష అంటూ ఒక్కటే నినాదాలు.
baksho-devi-chamba-himachal-athlete-1050x550-1024x536
బక్షోదేవి ది  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉనా జిల్లాలోని ఇస్పూర్ గ్రామం,  ప్రభుత్వ స్కూల్ లో 9వ తరగతి చదువుతుంది.  9 ఏళ్ళ క్రితమే తండ్రిని కోల్పోయింది. కూలీనాలీ చేస్తూ తల్లి ఆమెను పోషిస్తోంది. అయితే చిన్నప్పటి నుండి పరుగెత్తడం అంటే బక్షోకి చాలా ఇష్టం. పెద్ద రన్నర్ ని కావాలని కలలు కంటూనే, వాటిని నిజం చేసుకునేందుకు  క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుండేది.
బక్షోదేవి ప్రతిభ, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి.. జరిగిన రన్నింగ్ రేస్ విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటీజన్లు శరవేగంగా స్పందిచారు. చాలా మంది బక్షోదేవిని సహాయాన్ని అందించేందుకు ముందుకువచ్చారు.  ఓ వైద్యుడు ఆమెకు ఉచితంగా కిడ్నీ ఆపరేషన్ చేస్తానని హమీ ఇచ్చాడు. మరో PT ఉషగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బక్షోదేవి ధైర్యానికి  అభినందనలు..త్వరగా ఆమె ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top