చిన్నపిల్లల మెదళ్ళు దూదిపింజలు అనడానికి ఈ వీడియోనే సాక్ష్యం.! ప్రతి తల్లీదండ్రి తప్పక చూడాల్సిన వీడియో.

చిన్న వయసులో పిల్లల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు గురించీ తెలుసుకోవాలనుకుంటారు. ఏ చిన్న అనుమానం కలిగినా ఎందుకు అమ్మ అలా చేస్తున్నారు? ఎవరైనా ఇంటికి వచ్చినా వీళ్ళెవరు మన ఇంటికి వచ్చారు? నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అందులో ఏముంది? ఇలా కొత్త కొత్త ప్రశ్నలు వాళ్ళ మెదడులో తిరుగుతుంటాయి. ఎలాంటి జంకూ బెంకూ లేకుండా అడిగేస్తారు. అలా అడిగిన ప్రతిసారీ ప్రతి తల్లిదండ్రులూ ఎన్నిసార్లైనా సరే విసుగుచెందకుండా సమాధానం చెప్పాలి. అలా ఆ చిన్నపిల్లలు అడిగిన ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెబుతారో అదే ఎక్కువకాలం గుర్తుంటుంది. ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీ పాటికి మీ పనులతో బిజీగా ఉంటే మాత్రం వారు నిరాశపడతారు.

ఇక్కడ అలాంటి సంఘటనే ఒకటే చోటుచేసుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లాడని సరిగా పట్టించుకోకపోవడం వలన, ఆ ఇంట్లో వాతావరణం వలన స్కూల్ ఎగ్జాంలో బి ఫర్ ఏ బాలో లేక బ్యాట్ అని రాయాల్సిన వాడు బి ఫర్ బాంబ్ అని రాశాడు. ఇది చూసిన ఆ టీచర్ ఆ బాబు ఇంట్లో పరిస్థితిని తెలుసుకోవడానికి వారింటికి వచ్చింది. ఇంట్లో టీవీ ఆన్ చేసి ఎవరి పనుల్లో వారున్నారు. జరిగిన తప్పును టీచర్ తెలిపింది.  పేరెంట్స్ గా వారు ఎలాంటి స్టేజ్ లో ఉన్నారో అర్థం చేసుకున్నారు. అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకున్నారు.
అందరూ టీచర్లు ఇలా జరిగిన తప్పుల గురించి ఇంటికి వచ్చి మరీ చెప్పే వారుండరు కదా. రేపటి మీ పిల్లల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరేం చేయాలో ఆలోచించండి.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top