విమానంలో ప్యాంట్ విప్పేసి చెడ్డి మీద తిరిగిన ప్రయాణికుడు..పక్కకు అమ్మాయి ఉన్న పట్టించుకోని వైనం!!

ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలనేది ఓ నానుడి. కానీ వయసు పెరిగిన చిన్న పిల్లల కంటే హీనంగా ప్రవర్తించాడు ఒకడు. ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు చిన్న పిల్లలు బట్టలు విప్పేసినట్టు విమానంలోనే అందరిముందు ప్యాంట్ విప్పేశాడు. అంతే కాక గట్టిగా కేకలు వేయడంతో అందరూ భయపడ్డారు. ఈ సంఘటనని ప్రత్యక్షంగా చూసిన ఓ యువతి తన వేదనను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

లిజ్జి థాంప్సన్ అనే యువతి ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ప్రయాణం చేస్తుంది. ఈమె పక్కనే మరో వ్యక్తి కూర్చున్నాడు. విమానం కదిలేంత వరకు బాగానే ఉన్నా అతడు…విమానం గాల్లో ప్రయాణిస్తుండగా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. కనీసం విమానంలో ఉన్నాననే సోయి లేకుండా, పక్కకి ఆడవాళ్లు ఉన్నారనేది కూడా మర్చిపోయి తను వేసుకున్న ప్యాంట్ తీశేశాడు. కేవలం షాట్ మీద తిరుగుతూ ప్రయాణికులందరిని ఇబ్బందులకు గురి చేశాడు. షూస్, సాక్స్ కూడా తీసేసి బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడట. పక్కన కూర్చున్న యువతిని తన దగ్గర రమ్మని పిలిచాడట. దింతో ఆ యువతి తీవ్ర అసౌకర్యానికి గురిఅయ్యింది.

విమానంలో ఇంత జరుగుతున్నా.. సిబ్బంది కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ఈ ట్వీట్ కి నెటిజన్లు భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. ఆమెకి నెటిజన్లు సంపూర్ణ మద్దతునిస్తూ ఫ్లైట్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top