డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కంట్లో ప‌డాల‌ని…..!!

క‌టింగ్ చేయించుకుందామ‌ని….హైద్రాబాద్ L.B న‌గ‌ర్ లోని ఓ సెలూన్ కు వెళ్లాను. అక్క‌డ ఒక‌త‌ను క‌టింగ్ చేస్తూ క‌నిపించాడు…చూడ‌గానే షాక్ అయ్యాను, ఒక‌టికి రెండు సార్లు అత‌నిని ఎగాదిగా చూశాను.!! అత‌డి ఆహార్యం చూస్తే చాలా వింత‌గా అనిపించింది. బారు గ‌డ్డం, త‌ల వెంట్రుక‌ల‌కు డిఫ‌రెంట్ క‌ల‌ర్స్, చెవిలో క‌త్తి షేప్ లోని దిద్దు, మెడ‌లో బ‌ఫెల్లో లాకెట్…. సిక్స్ ప్యాక్స్ బాడీ చూడ‌డానికి ప‌ర్ఫెక్ట్ రాజ‌మౌళి సినిమాలోని విల‌న్ ఉన్న‌ట్టు ఉన్నాడు.

అలా క‌టింగ్ చేయించుకుంటున్నంత సేపు అత‌నితో మాట్లాడ‌డం మొద‌లు పెట్టా….హ‌లో భ‌య్యా…మీరెప్పుడైనా సినిమాలో ప్ర‌య‌త్నించారా? అని ……. దానికి అత‌ను…అవును భ‌య్యా … నా టార్గెట్ యే సినిమాలు…అందుకే ఈ వేషాలు… కానీ ఆ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో తెలియ‌దు…తెలిసిన కొద్దిమంది స‌హాయంతో చాలా ప్ర‌య‌త్నాలు చేశాను కానీ అవేవీ ప్ర‌య‌త్నించ‌లేదని అన్నాడు.

ఫోన్ లో ఉన్న అత‌ని ఫోటోలు చూపిస్తూ….ఎప్ప‌టికైనా నేను రాజ‌మౌళి కంట్లో ప‌డాలి…ఓ మంచి విల‌న్ గా సినిమా ఇండ‌స్ట్రీలో పేరు తెచ్చుకోవాల‌ని చాలా కాన్ఫిడెంట్ గా అన్నాడు. అత‌డి మాట‌లో ఓ ఆత్మ‌విశ్వాసం క‌నిపించింది… గ‌త మూడేళ్లుగా ఇదే ఆహార్యంతో ఇత‌ను చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో కూడా ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. మ‌రి త్వ‌ర‌లోనే మ‌నోడి కోరిక తీరాల‌ని….విల‌న్ గా వెండితెర మీద రంగ ప్ర‌వేశం చేయాల‌ని కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్ రామ‌కృష్ణ‌.

అత‌ని ఫోటోలు:

Comments

comments

Share this post

scroll to top