గణితం ఆధారంగా ఒక రాజు 121 మంది స్త్రీలతో 15 రోజుల శయనించాలి…

ప్రపంచం అభివృద్ధిలో దూసుకుపోతోంది అంటే అందులో గణితం ప్రభావం ఎక్కువ శాతం ఉందని చెప్తారు. ప్రాచీన నాగరికతకు గణిత శాస్త్రం ప్రామాణికంగా ఉంది. ఈజిప్టు, గ్రీస్ లలో మొదలైన గణితశాస్త్రం ఇప్పుడు అక్కడ పురోగతిలో లేదు. కానీ తూర్పు ప్రపంచంలో గణిత శాస్త్రం చాలా పురోగమించింది.

వేల మైళ్లు ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మానానికి కూడా గణిత శాస్త్రమే ప్రామాణికంగా చెప్తారు. అంతే కాదు చక్రవర్తులు పాలనా పరిపాలనలోనూ గణితం కీలక పాత్ర పోషించింది. చక్రవర్తి నిర్ణయాలన్నిటి పైనా… ఏ రోజు ఓ పని చెయ్యాలి అన్నది కూడా కేలండర్… గ్రహాల కదలికల మీదే ఆధారపడి ఉండేది.

చక్రవర్తి ఏ రోజు ఎంత మంది స్త్రీలతో శయనించాలో కూడా సూచిస్తూ ప్రాచీన రాజస్ధాన సలహాదారులు ఒక వ్యవస్థను తయారు చేసారు. రేఖాగణిత శ్రేణి అనే గణిత సిద్ధాంతాన్ని ఉపయోగించి దీనిని రూపొందించారు. ఒక్కోసారి చక్రవర్తి 15 రోజుల్లో 121 మంది స్త్రీలతో శయనించాల్సి వచ్చేదట.

ప్రతి మహిళా బృందం… మొదటి బృందం కన్నా మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది. కాబట్టి.. చక్రవర్తి 15 రాత్రుల్లో తన అంతఃపురంలో ఉన్న ప్రతి మహిళతోనూ శయనించేలా గణిత నిపుణులు షిఫ్టులు పరంగా వ్యవస్ధను తయారు చేసారు.

మొదటి రాత్రిని భార్యకు కేటాయించగా… రెండో రోజు ముగ్గురు సీనియర్ సహచరిణులకు కేటాయించారు. ఇక మూడో రోజు రాత్రి 9 మంది భార్యలకు కేటాయించారు. ఆపైన 27 మంది ఉంపుడుగత్తెలను ఒక్కో రాత్రికి తొమ్మిది మంది చొప్పున విభజించి.. వారికి మూడు రోజులు కేటాయించారు

ఇక మిగిలిన 81 బానిస స్త్రీలను తొమ్మిది మంది చొప్పున విభజించి తొమ్మిది రోజులు కేటాయించారు. ఇక పౌర్ణమి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం అత్యున్నత శ్రేణి స్త్రీలతో చక్రవర్తి శయనించేలా కూడా ఈ రోటాను తయారు చేశారు.

పున్నమి రోజుల్లో ఆయా మహిళల స్త్రీశక్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని.. అప్పుడు చక్రవర్తి పురుషశక్తితో సమానంగా ఉండగలదని ఈ రోటా రూపకర్తల ఆలోచనగా చెప్తారు. ఈ వ్యవస్థ ఏర్పాటు సామ్రాజ్యానికి ఉత్తమమైన వారసుడి కోసమే అని చెప్తారు.

టి సార్వభౌముడు ఎల్లో ఎంపరర్.. అంకెలకు విశ్వాంతర ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తూ.. తను పూజించే ఒక దేవత ద్వారా గణాంకశాస్త్రాన్ని సృష్టింపజేశారని చైనా పురాణగాథ చెప్తోంది. బేసి సంఖ్యలను పుంలింగంగానూ, సరి సంఖ్యలను స్త్రీలింగంగానూ పరిగణిస్తారు. నాలుగో అంకె (4) ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవాలన్నది వారి విశ్వాసాల్లో ఒకటి. అదే సమయంలో ఎనిమిది (8) సిరి సంపదలను తెచ్చిపెడుతుందనీ నమ్ముతారు.

 

 

Comments

comments

Share this post

scroll to top