ఆ ఎన్ఆర్ఐ మ‌హిళ‌కు హైదరాబాద్‌లో ఓ హోట‌ల్ వారు రూమ్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా..?

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని సంద‌ర్శించేందుకు రాక రాక వ‌చ్చిన ఓ ఎన్ఆర్ఐ మ‌హిళ‌కు వింత అనుభ‌వం ఎదురైంది. ఆమె ఓ ట్రావెల్ వెబ్‌సైట్‌లో ముందుగానే న‌గ‌రంలోని ఓ హోట‌ల్‌లో రూం బుక్ చేసుకుంది. తీరా సిటీకి వ‌చ్చిన ఆ హోట‌ల్‌కు వెళ్లాక ఆ హోట‌ల్ వారు ఆమెకు రూమ్ ఇచ్చేందుకు స‌సేమిరా అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలా అని చెప్పి ఆమె చ‌ట్ట వ్య‌తిరేక ప‌నులు చేసిన వ్య‌క్తా, చెడ్డ వ్య‌క్తా, టెర్ర‌రిస్టా.. అంటే అది కాదు, ఆమె మంచి వ్య‌క్తే. సాధార‌ణ పౌరురాలే. కానీ ఆమెకు ఆ హోట‌ల్ వారు రూమ్ ఇవ్వ‌లేదు. ఎందుకో కార‌ణం తెలిస్తే ఎవ‌రైనా నోరెళ్ల బెడ‌తారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఆమె పేరు నుపుర్‌ సారస్వత్‌. ఎన్ఆర్ఐ. చాలా రోజుల త‌రువాత హైద‌రాబాద్ చూడాల‌నిపించి న‌గ‌రానికి ఈ నెల 24వ తేదీన శ‌నివారం వ‌చ్చింది. అయితే ఆమె అంత‌కు ముందే గోఐబిబో అనే ట్రావెల్ సైట్‌లో ఎర్రగడ్డలోని హోటల్‌ దక్కన్‌లో గది బుక్‌ చేసుకుంది. ఈ క్ర‌మంలో శనివారం నగరానికి రాగానే ఆమె బుక్ చేసుకున్న హోట‌ల్‌కు నేరుగా వెళ్లింది. అయితే ఆమెకు ఆ హోట‌ల్ వారు రూమ్ ఇవ్వలేదు. ఎందుక‌ని ఆమె అడ‌గ్గా అందుకు వారు సిల్లీ కార‌ణం చెప్పారు. ఆమె ఒంటరిగా వ‌చ్చింద‌ట‌. సింగల్‌ లేడీ ( ఒంటరి మహిళ) అన్న కారణంతో హోటల్ వారు ఆమెకు గది ఇచ్చేందుకు నిరాక‌రించారు. దీంతో ఈ విష‌యం ప‌ట్ల ఆమె అస‌హ‌నానికి లోనైంది.

ఈ క్ర‌మంలో నుపుర్ సార‌స్వ‌త్ వెంట‌నే ఈ విషయాన్ని త‌న‌ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, దీన్ని స‌ద‌రు ట్రావెల్ వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేసింది. సింగిల్ గా వ‌చ్చే వారికి రూమ్ ఇవ్వ‌క‌పోతే ఆన్‌లైన్‌లో రూమ్ ఎలా బుక్ చేశారు అంటూ ఆ వెబ్‌సైట్‌పై విరుచుకు ప‌డింది. దీంతో ఆ వెబ్‌సైట్ వారు నుపుర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. న‌గ‌రంలోనే మ‌రో హోట‌ల్‌లో ఆమెకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. ఎలాంటి చార్జి తీసుకోలేదు. కాగా ఇలాంటి చిత్ర‌మైన నిబంధ‌న‌ల‌ను పెట్టే హోట‌ల్స్‌ను త‌మ వెబ్‌సైట్ లిస్ట్ నుంచి తొలగిస్తామ‌ని కూడా ఆ వెబ్ సైట్ వారు చెప్ప‌డంతో ఇక నుపుర్ శాంతించింది. అవును మ‌రి, అదేమైనా నెల‌వారీగా రెంట్‌కు ఇచ్చే అద్దె రూమా..? బ‌్యాచిల‌ర్స్‌కు, సింగిల్ వ్య‌క్తుల‌కు ఇవ్వ‌క‌పోవ‌డానికి. నిజంగా ఇలాంటి చిత్ర‌మైన నిబంధ‌న‌లు మ‌న‌కు ఎక్క‌డో గానీ క‌నిపించ‌వు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top