పోకిరీలు చెలరేగిపోతున్నారు. ఎంతగా అంటే ఏకంగా రాష్ట్ర ముఖ్య మంత్రి భార్యకే అసభ్యకర మెసేజ్ లు పంపించి, ఇబ్బంది పెట్టేంతగా…. అవును దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు యూపిలోని ఖాలేపూర్ గ్రామానికి చెందిన రాహుల్ ఖారె(22) వాట్సప్‌లో అసభ్యకర సందేశాలు పంపాడు. ఈ అసభ్యకర మెసేజ్ లు చూసి అవాక్కయిన డింపుల్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ పై సైబర్ చట్టం కింద కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
For Face Book Updates: సిఎం భార్యకు బూతు మెసేజ్ లు.
గత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ కనౌజ్ పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు. అతి తక్కువ కాలంలోనే సామాజిక వెబ్ సైట్లలో అత్యధిక ఆదరణ సాధించారామె. ఫేస్ బుక్, ట్విట్టర్స్ లో ఆమెకు పెద్ద సంఖ్యలో పాలోవర్స్ ఉన్నారు. లక్నో యూనివర్సిటీ నుండి ఆమె కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు.
పోకిరీలు సెలెబ్రిటీలకు ఇలా అసభ్యకర మెసేజ్ లు పంపడం ఇది కొత్త కాదు గతం లోకూడా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. మన దగ్గర కూడా నటి హేమకు ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్ పంపాడు ఓ యువకుడు. ఏదో చూడరులే అనుకొని ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడితే జైలు ఊచలు తప్పవు మరి.