వరుడికి తాళి కట్టిన యువతి ఎక్కడో తెలుసా.??

పెళ్లి అనగానే మనకు గుర్తొచ్చేది డోలు, సన్నాయిలు,బజంత్రీలు,డీజేలు.పెళ్లిళ్లలో కుల,మతాల వారీగా ఎవరి పద్దతులు వారికి ఉంటాయి. ఏ పద్దతిలో చేసిన చివరికి తాళిబొట్టు మాత్రం వధువు మెడలో పడాల్సిందే. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయి అబ్బాయి మెడలో తాళి కట్టింది. ఈ వింత ఘటన కర్ణాటకలో జరిగింది.

విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ తాలుకా నాలతవాడ గ్రామానికి చెందిన ప్రభురాజ్ కి పెళ్లి కుదిరింది. కాగా.. సోమవారం వీరి వివాహం జరగగా.. వరుడు ప్రభురాజ్‌కు అంకిత, మూడు ముళ్లు వేశారు. వీరిలాగే మరో జంట కూడా ఇదే రకంగా వివాహం చేసుకున్నారు. దింతో పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇదేమి పెళ్లి అని బంధువులంతా ప్రశ్నించారు. దీనికి వారు 12వ శతాబ్దంలో ఈ పద్ధతే అమల్లో ఉండేదని, దాన్నే మేమూ పాటించామని సమాధానమిచ్చారు. ఇవి అసలుసిసలైన బసవణ్ణ సిద్ధాంతాలకు లోబడి జరిగిన వివాహాలని విమర్శకులకు సమాధానం ఇస్తున్నారట. ఇంకో విషయమేమిటంటే ఈ వినూత్న వివాహ వేడుకలకు ఆధ్యాత్మికవేత్తలు, స్వాములు కూడా హాజరుకావడం విశేషం.

Comments

comments

Share this post

scroll to top