CM ను షేక్ చేస్తున్న 19 యేళ్ల కుర్రాడు!?

నోట్ల ర‌ద్దు ఓ యువ‌కుడిని జైళు పాలు చేసింది. అనుచిత వ్యాఖ్య‌ల కార‌ణంగా కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. కానీ ఆ కుర్రాడు మాత్రం అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. త‌న కామెంట్ లో ఏం త‌ప్పుందో నిరూపించాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. త‌న‌పై అన్యాయంగా కేసులు పెట్టార‌ని వాపోతున్నాడు. దీని వెనుక సీఎం హ‌స్తం ఉంద‌ని వెంట‌నే త‌న‌కు న్యాయం జ‌రిగేలా చూడాలంటున్నాడ. సిఎం వ‌ర్సెస్ కామ‌న్ మ్యాన్ గా మారిన ఈ స్టోరీ త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే.

abhshek-750x500

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో అభిషేక్ మిశ్రా అనే 19 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న ఈ కుర్రాన్ని రాత్రికి రాత్రే రూం నుండి తీసుకెళ్లి ఓ ప్రాంతంలో బంధించారు. అత‌ని వ‌ద్ద నుండి లాప్ ట్యాప్, ఫోన్, మెమోరీ కార్డు లాగేసుకుని ఇంటికి పంపించారు. సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడా కుర్రాడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హీరో అయి కూర్చున్నాడు. కార‌ణం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహ‌న్ కి వ్య‌తిరేకంగా విడుద‌ల చేసిన ఓ వీడియోనే. త‌న‌ని అరెస్ట్ చేయ‌డానికి కార‌ణాలు తెలపాలంటూ డిమాండ్ చేశాడు. అంతే కాదు శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ పై భారీ స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ప‌క్కా ఆధారాల‌తో మాట్లాడిన‌ట్టు కనిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కేవ‌లం ఒక్క రోజుల‌నే ఈ కాంట్రావ‌ర్సియ‌ల్ ఫోస్ట్ 16వేల మంది ఫాలోవ‌ర్స్ ని రీచ్ అయింది. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌హ‌రాన్ని ఎలా తేల్చాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో చౌహ‌న్ 3 కోట్ల న‌ల్ల‌ద‌నాన్ని అక్ర‌మంగా త‌ర‌లించార‌న్న‌ది ఈ వీడియోలోని పూర్తి సారాంశం. ఇప్ప‌టికే అభిషేక్ పై ఐపిసి 469, 60సి సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు అయ్యాయి. అయితే ఈ వీడియో వైర‌ల్ అవుతుండ‌టంతో అభిషేక్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది చూడాల్సి ఉంది.

Comments

comments

Share this post

scroll to top