ఈ పాప నాన్నకిచ్చిన మాట కోసం పడుతున్న కష్టానికి సలాం.!

ఈ పాప పేరు సోంబరి సబర్.ఆమెకు 11 యేళ్ళు, జార్ఖండ్ లోని ఓ మారుమూల పల్లెటూర్లోని స్కూల్ లో 5 వతరగతి చదువుతుంది. సోంబరికి  తల్లీతండ్రులు లేరు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది, తండ్రి కూడా ఇటీవలి కాలంలో అనారోగ్యంతో చనిపోయాడు. తల్లీదండ్రులున్నప్పుడు  ఇంటికొచ్చే బంధువులు వారి మరణం తర్వాత రావడమే మానేశారు. ఆమెను సంరక్షించే బాధ్యతలు తీసుకోడానికి కూడా ఏ ఒక్క బంధువు ముందుకు రాలేదు.

అయినప్పటికీ సోంబరి సబర్ ఏ మాత్రం అధైర్య పడలేదు.  ఒంటరిగానే వారి ఇంట్లో ఉంటోంది. కరెంట్ లేదు, కనీసం కిరోసిన్ దీపం కూడా కొనుక్కోలేని స్థితిలో ఆమె ఉంది. కానీ ఆమె చెవులలో   “బుజ్జి బాగా చదవాలి, నాకు పేరు తేవాలి” అని నాన్న చెప్పిన మాటలే ఎప్పుడూ ప్రతిధ్వనించేవి. నాన్న మాటలే స్పూర్తిగా ముందుకు కదిలింది సోంబరి. ఆస్తులేమీ లేవు..ఆదుకునే వారు కూడా ఎవ్వరూ లేరు.

School-750x500

చదవాలంటే- బతకాలి, బతకాలంటే- తినాలి…తినాలి అంటే -డబ్బు కావాలి, డబ్బు కావాలంటే -పనిచేయాలి. ఈ జీవన సూత్రాన్ని తెల్సుకున్న సోంబరి ..ఆ రోజు నుండి ఈ రోజు వరకు  ఉదయాన్నే నిద్రలేవడం. తన ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే అడవిలోకి వెళ్లడం, కట్టెలు కొట్టుకొని అంతదూరం నుండి మోసుకొని వచ్చి ఊరూ ఊరు తిరిగి అమ్మడం. మళ్లీ 9 వరకు స్కూల్ కు వెళ్లడం ఇదే తన దినచర్యగా మార్చుకుంది. అలా కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తనను తాను పోషించుకుంటుంది.  మరో విషయం ఏంటో తెలుసా…ఇంత వరకు సోంబరి లేట్ గా స్కూల్ కు వచ్చిన రోజు కానీ , స్కూల్ తప్పించిన రోజు కానీ లేదంట..ఈ మాటలు స్వయంగా ఆ స్కూల్ టీచరే చెప్పాడు.

ఆనోట ఈ నోట సోంబరి కష్టం, ఆమె లక్ష్యం తెలుసుకున్న చాలా NGO లు ఆమెను దత్తత తీసుకోడానికి ముందకొచ్చాయి. అలాగే జంషెడ్ పూర్ కు చెందిన సిండికేట్ బ్యాంక్ ఉద్యోగి, ఘట్ సిలాకు చెందిన టీచర్ దంపతులు సోంబరిని దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారట. దుమురియా జిల్లా చిన్న పిల్లల సంరక్షణ అధికారి చంచల్ కుమారి నిర్ణయం బట్టి, సోంబరిని ఎవరికి అప్పగించాలి అనేది ఆధారపడి ఉంది. తను ఎక్కడికెల్లినా తన లక్ష్యం మంచిగా చదివి నాన్నకు పేరు తేవడమే అంటోంది ఈ చిన్నారి.

Comments

comments

Share this post

scroll to top