అమ్మను చూడాలి,ఇంటికి వెళ్లాలి, ఆ బాబు గుండెల్ని పిండే ప్రశ్నలు.

తూర్పు గోదావరి జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది అక్కడిక్కడే మృతి చెందాడు, ఈ రోడ్డు ప్రమాదంలో కిరణ్ సాయి అనే 8 యేళ్ల బాలుడు  మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇన్ని రోజుల చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న కిరణ్ ఒక్కసారిగా లేచి ‘అమ్మానాన్న ఇప్పటివరకూ ఆస్పత్రికి రాలేదు.. అక్క కూడా లేదు. ఫోన్ చేసినా పనిచేయట్లేదు. ఇంటికి నేనే వెళ్తా.. తీసుకెళ్లండి.’ అని  తమ బంధువులను అమాయకంగా అడుగుతున్నాడు.

accident

అతడు తప్ప అతని కుటుంబం మొత్తం ఆ రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. ఈ విషయం తెలియని కిరణ్ , అమ్మా అని ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుందని అతని బంధువులంటున్నారు. అమ్మా,నాన్న,అక్క ఇక ఎప్పటికి తిరిగి రారు అని అతనికి ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి వారిది.

a boy alive in accident

 

ఒంటరిగా మిగిలిన కిరణ్‌లో భయాన్ని పోగొట్టి మానసిక స్థైర్యం నింపేందుకు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ దీపామోహన్ ప్రయత్నిస్తున్నారు. కిరణ్  త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిద్దాం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top