త్రివిక్రమ్ “అ..ఆ” సినిమా మీకోసం.?! ఆశ్చర్యపోవడం మీ వంతు.

జూన్ 2 న విడుదలైన త్రివిక్రమ్ అ..ఆ సినిమా వసూళ్ల పరంగా దుమ్ములేపుతుంది. సహజంగానే ఫ్యామిలీ స్టోరీలను తీసుకొని…తన మార్క్ డైలాగ్స్ లతో రక్తి కట్టిస్తాడు త్రివిక్రముడు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తీసిన  “అ…ఆ” సినిమా…43 సంవత్సరాల క్రితం వచ్చిన మీనా అనే సినిమాకు  అఫీషియల్ రిమేక్ . విజయనిర్మల దర్శకత్వం వహించిన “మీనా” సినిమాలోని పాత్రలను అలాగే ఉంచి, ఈ తరం నటులతో  రిప్లేస్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ ముందే కొనుగోలు చేయడంతో…గోల జరగట్లేదు కానీ…లేకపోతే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యేది. ఓ రకంగా చెప్పాలంటే ఇది మీనా సినిమాకు అఫీషియల్ రిమేక్ అని చెప్పొచ్చు.

పాత సినిమాకు కొత్తగా తీసినట్టే అనిపిస్తుంది. మీకేమైనా డౌట్ ఉంటే..మీరు ఈసినిమాను చూడొచ్చు..అంతకంటే ముందు మీకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

కొత్త సినిమా (అ ఆ)లో పాత్రలు- పాత సినిమా ( మీనా) లో పాత్రలు :

  •  నితిన్= కృష్ణ.
  • సమంత= విజయనిర్మల.
  • అవసరాల శ్రీనివాస్ =జగ్గయ్య
  • నరేష్ = గుమ్మడి .
  • నదియా లాగే  = విజయనిర్మల తల్లి అహంకారి.
  • కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి =సూర్యకాంతం.
  1. సినిమా స్టార్టింగ్ లో కాకుండా హీరోయిన్ అత్తయ్య ఊరికి ట్రైన్ లో బయలు దేరే ముందు టైటిల్స్ పడడం.
  2. నితిన్ చెల్లె కు సమంత ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాస్ ను ఎలా  లైన్ లో పెడతారో. సేమ్  జగ్గయ్య కూడా విజయనిర్మలను చేసుకోవడానికి వచ్చి, కృష్ణ చెల్లెల్నే చేసుకుంటాడు.
  3. అత్తయ్య వారింట్లో అమ్మకు తెలియకుండా పాత సినిమాలో 7 రోజులు గడిపితే…అ ఆ లో పదిరోజులు గడపడం.
  4. ఇక సీన్ టు సీన్ మ్యాగ్జిమమ్ మీనా సినిమానే అని చెప్పొచ్చు.

NOTE 1: ఓ సారి మీనా సినిమాను యూట్యూబ్ లో చూసి, తర్వాత అ ఆ సినిమాను థియేటర్లో చూస్తే పిచ్చ క్లారిటీ వస్తుంది.

( ఇవి నా అభిప్రాయాలు మాత్రమే….షరతులు వర్తిస్థాయి)

Watch  A..AA movies Sorry Meena Movie:

A-Aa-Official-Trailer-Final

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top