ఆటోడ్రైవర్ అకౌంట్ లో…9860 కోట్లు.! అనుమానంతో పాస్ బుక్ లాగేసుకున్న బ్యాంక్.!!

అతనో టాక్సీ డ్రైవర్. పేరు బల్వీందర్ సింగ్. పంజాబ్‌లో నివాసం. డ్రైవింగ్ చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. అలాంటి బల్వీందర్ కి…. మీ అకౌంట్లో 9860 కోట్ల రూపాయలున్నాయంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల నుండి మెసేజ్ వచ్చింది. నా అకౌంట్ లో అన్ని కోట్లా? అని ఆశ్చర్యానికి లోనైన బల్వీందర్ ఆ తరువాత తేరుకుని బ్యాంక్ కి వెళ్లి అక్కడి అధికారులకు తెలియజేశాడు.

అతడి పిర్యాదు మేరకు….. బల్విందర్ జన్ ధన్ యోజన అకౌంట్లోకి ఇంత డబ్బు వచ్చి చేరడంతో అతని అకౌంట్ ను పరీశిలించిన బ్యాంక్ అధికారులు అతని పాస్ బుక్ లాగేసుకున్నారు. అంతే కాకుండా…అతనిని బ్యాంక్ లోపలికి కూడా రానివ్వలేదు. బల్వీందర్ అకౌంట్ లో రూ. 200 క్రెడిట్ ఎంట్రీ చేసేటప్పుడు 11 అంకెల ఇంటర్నల్ బ్యాంకింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటు నంబర్ కూడా దీనిలోనే వేసేశారని, అందువల్ల ఆ మొత్తం వచ్చినట్లు కనిపించిందని చెప్పారు. మర్నాడు ఈ తప్పును తెలుసుకుని మళ్లీ సరి చేశామని వివరించారు.

15282082_1379731562072049_1666013912_n

అయితే బ్యాంక్ లో జరిగిన లావాదేవీలు మాత్రం అనుమానం కలిగించేవిగా ఉన్నాయి…. ఎందుకంటే నోట్ల రద్దు జరిగింది నవంబర్ 8 వ తేది, బల్వీందర్ అకౌంట్లోకి డబ్బు వచ్చి చేరిన తేది నవంబర్ 4న, తిరిగి ఎమౌంట్ వెనక్కి వెళ్లిన తేది నవంబర్ 10. ఈ డేట్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే….నోట్ల రద్దు విషయం ముందే తెలిసిన ఎవరో…తమ వద్దు ఉన్న బ్లాక్ మనీని ఇన్ యాక్టివ్ గా ఉన్న అకౌంట్ లోకి బదిలీ చేశారని, వాటినే నోట్ల రద్దు తర్వాత వైట్ మనీ గా మార్చారని, ఈ ట్రాన్జాక్షన్ లో బ్యాంక్ అధికారుల పూర్తి సహాయ సహాకారాలున్నాయనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఖాతాదారుడి నుండి పాస్ బుక్ లాగేసుకోవడం, అతనిని బ్యాంక్ లోకి రానివ్వకపోవడం కూడా ఈ అనుమానానికి బలం చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీర అంతా సెట్ అయ్యాక పిలిచి బ్యాంక్ అధికారులు కొత్త పాస్ బుక్ ను బల్వింధర్ చేతిలో పెట్టడం విశేషం, ఈ విషయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తును స్టార్ట్ చేసింది.

Comments

comments

Share this post

scroll to top