ధోనీ, యువరాజ్ లను వందేమాతర గీతంలో ఉత్తేజపర్చిన 30 వేల మంది ప్రేక్షకులు. స్టేడియమంతా మార్మోగిన వందేమాతరం.

2011 క్రికెట్ వరల్డ్‌కప్ గుర్తుందా? ఆ టోర్నమెంట్‌లో టీమిండియా ఆది నుంచి తనదైన సత్తా చాటి ఫైనల్స్‌లో శ్రీలంక జట్టుపై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ముంబై వాంఖడే స్టేడియంలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ ధోనీ లాంగ్ ఆన్ మీదుగా ఓ భారీ సిక్సర్ కొట్టి చారిత్రాత్మక విజయాన్ని జట్టుకు అందించాడు. అంతేకాదు, తన సిక్సర్‌తో కోట్లాది భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
అయితే ఆ మ్యాచ్‌లో మన జట్టు క్రీడాకారుల ప్రదర్శనకు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు కూడా పరోక్షంగా మద్దతుగా నిలిచారు. దాదాపు 30వేల మంది వీక్షకులు ఒకేసారి వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని, దేశాభిమానాన్ని చాటడంతోపాటు క్రీడాకారుల్లో స్ఫూర్తినింపారు. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన యావత్ దేశ ప్రజల హృదయాలను దేశభక్తితో ఉప్పొంగేలా చేసింది. ఆ వీడియోను ఇప్పుడు మీరూ చూడవచ్చు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top