4 బంతుల్లో 92 పరుగులు..ఒక్క సిక్స్ కూడా లేదు..! ఇది ఎలా సాధ్యమయిందో తెలుసా..?

ఓవర్ కి 6 బంతులు..అన్ని సిక్స్ లు కొట్టిన 36 పరుగులు స్కోర్ చేయొచ్చు. మహా అంటే రెండో మూడో నోబ్లు లేదా వైడ్ లు…కానీ 4 బంతుల్లోనే 92 పరుగులు స్కోర్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు అది సాధ్యమేనా అనుకుంటున్నారా..? బాంగ్లాదేశ్ బౌలర్లు సాధ్యమే అని నిరూపించారు. బ్యాట్స్‌మెన్ సిక్సర్లు బాదితేనో, బౌండరీలు కొడితేనో ఈ పరుగులు రాలేదు. మరి ఎలాగంటారా? వివరాలు మీరే చూడండి!

నాలుగు బంతులేయడానికి బంగ్లా బౌలర్ 13 వైడ్లు విసరగా.. అవన్నీ బౌండరీ లైన్‌ను తాకడంతో 65 పరుగులొచ్చాయి. వైడ్లు వేసినోడికి నోబాల్స్ ఒక లెక్కా.. అలవోకగా 15 నోబాల్స్ వేసేశాడు. ఇక కుదురుగా నాలుగు బంతులు విసిరితే బ్యాట్స్‌మెన్ 12 పరుగులు రాబట్టారు. మంగళవారం ఢాకా సెంకడరీ డివిజన్ క్రికెట్ లీగ్‌లో ఆక్సియమ్ – లల్మాటియా జట్ల మధ్య మ్యాచ్‌లో “సుజాన్ మహ్మద్” అనే బౌలర్ ఈ ఘనత సాధించాడు. ఢాకాలోని సిటీ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదికైంది.

 

Comments

comments

Share this post

scroll to top