9 వ తరగతి కుర్రాడు..అంధుల కోసం అతిచవకైన ప్రింటర్ ను రూపొందించాడు.

సాధించాలన్న సంకల్పం, మనుషులకు సాయపడాలన్న మానవత్వం ఉంటే లక్ష్యసాధన ఎంతకష్టమైనా సరే దాన్ని సాధించవచ్చని నిరూపించాడు శుభమ్ బెనర్జీ. అతడి లక్ష్యానికి ప్రతిరూపమే ‘బ్రెయిలీ ప్రింటర్’. ప్రతిరోజూ మనం బస్టాప్ ల వద్దనో, గుళ్ళ దగ్గరో అంధులను చూస్తుంటాం, వారిపట్ల సానుభూతిగా చూస్తూ పాపం అనుకుంటుంటాం…. కానీ శుభమ్ బెనర్జీ  వారి పట్ల సానుభూతిని ప్రకటించడం కాకుండా వారికి సహాయపడాలని అనుకున్నాడు. అదిగో అలాంటి సంకల్పం నుండి పుట్టిందే ఈ బ్రెయిలీ ప్రింటర్.

yourstory-shubham-banerjee

అంధులు… బ్రెయిలీ లిపి వల్ల వాళ్ళు చదవుతారని,దాని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్రెయిలీ లిపి పుస్తకాలు వారికి అవసరమని తెలుసుకున్న బెనర్జీ ఆ దిశగా ఆలోచించాడు.. అయితే  ప్రస్తుతం బ్రెయిలీ ప్రింటర్ ధర సుమారుగా లక్ష ఇరవై వేలు ఉండడాన్ని గమనించిన బెనర్జీ…అంధుల కోసం ఓ ప్రింటర్ తయారు చేయాలి అది కూడా చాలా తక్కువ ధరలో అని నిశ్చయించుకున్నాడు..దానికనుగుణంగానే  తీవ్రంగా శ్రమించి  కేవలం ఇరవై వేల రూపాయలలో ఓ బ్రెయిలీ ప్రింటర్ ను కనిపెట్టాడు బెనర్జీ.  త్వరలోనే ఈ ప్రింటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాడు.

అమెరికా లోని శాంతాక్లారాలో 9వ చదువుతున్న బెనర్జీ, తాను రూపొందించిన బ్రెయిలీ ప్రింటర్ ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన టెక్ ఫెయిర్ లో ప్రదర్శించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన డెస్క్ టాప్ ప్రింటర్ ను బెనర్జీ రూపొందించాడు. కంప్యూటర్ ప్రోగ్రాంలో ఉన్న ఫైల్స్ కు కాగితంపై అక్షరరూపం వచ్చేలా చేస్తుంది ఈ బ్రెయిలీ ప్రింటర్. విండోస్ తో నడిచే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్ కి ఈ ప్రింటర్ ను కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ను తీసుకోవచ్చు. ఈ ప్రింటర్ కు ‘బ్రెయిగో’ ప్రింటర్ ను నామకరణం చేసిన బెనర్జీ.

Comments

comments

Share this post

scroll to top