ఫేస్‌బుక్ ను మ‌రింత ఈజీగా వాడేందుకు 9 కీ బోర్డ్ షార్ట్ క‌ట్స్‌..!

ఫేస్‌బుక్‌… నేడు అధిక శాతం మంది వాడుతున్న సోష‌ల్ సైట్లలో ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. పీసీ, టాబ్లెట్‌, ఫోన్‌… ఇలా ఏ డివైస్ తీసుకున్నా అందులో ఫేస్‌బుక్ ను వాడేవారే ఎక్కువ‌. ఈ క్ర‌మంలో ఫేస్‌బుక్ ను వాడ‌డం మ‌రింత సుల‌భ‌త‌రం అవ్వాలంటే అందుకు కంప్యూట‌ర్ యూజ‌ర్ల‌కు కింద ఇచ్చిన ప‌లు షార్ట్‌క‌ట్స్ ఎంత‌గానో ఉపయోగ‌ప‌డ‌తాయి. వీటితో మౌస్ ప‌నిలేకుండానే కేవ‌లం కీ బోర్డ్ ద్వారానే ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు. ఆ కీ బోర్డ్ షార్ట్‌క‌ట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

facebook-keys

1. డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ను వాడుతుంటే సెర్చ్ బాక్స్‌లో నేరుగా టైప్ చేసేందుకు alt + / షార్ట్ క‌ట్‌ను ప్రెస్ చేస్తే చాలు. దాంతో సెర్చ్ బాక్స్ యాక్టివేట్ అవుతుంది. అందులో నేరుగా యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన స‌మాచారం వెద‌క‌వ‌చ్చు.

2. ఎవ‌రికైనా మెసేజ్ పంపాల‌నుకుంటే alt + m బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేయాలి.

3. హోం పేజీకి చేరుకోవాలంటే alt + 1 కీ లను ప్రెస్ చేయాలి.

4. ప్రొఫైల్ పేజీలోకి వెళ్లాలంటే alt + 2 కీస్‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

5. ఫ్రెండ్స్ పంపిన రిక్వెస్ట్‌ల‌ను యాక్సెప్ట్ లేదా డినై చేసేందుకు alt + 3 కీల‌ను ప్రెస్ చేయాలి.

6. మెసేజ్ పేజీలోకి వెళ్లాలంటే సింపుల్‌గా alt + 4 కీల‌ను ప్రెస్ చేస్తే స‌రిపోతుంది.

7. నోటిఫికేష‌న్స్ చూడాలంటే alt + 5 కీల‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

8. ప్రైవ‌సీ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లేందుకు alt + 7 కీల‌ను ప్రెస్ చేయాలి.

9. ఫ్యాన్ పేజీలోకి alt + 8 కీల‌ను ప్రెస్ చేయ‌డం ద్వారా చేరుకోవచ్చు.

Comments

comments

Share this post

scroll to top