“Hmm” అని ఎక్కువ అంటే “సైకో” అవుతారంట.? అంతేకాదు ఈ 9 గుర్తులు కనిపిస్తే కూడా “సైకో”.!.ఎందుకంటే?

భూమిపై నివ‌సించే ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక మాన‌సిక రుగ్మ‌త ఉంటుంది. కానీ కొంద‌రిపై మాత్రమే ఆ ప్ర‌భావం ఎక్కువగా ప‌డుతుంది. దీంతో వారు ప‌లు మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు లోన‌వుతుంటారు. నిత్య జీవితంలో అనేక సంద‌ర్భాల్లో ఆ స‌మ‌స్యలు వారికి ఎదుర‌వుతుంటాయి. అయితే వీరిలో కొద్ది మంది మ‌రీ సైకోపాత్‌లుగా మారుతారు. అలాంటి వారిలో మాన‌సిక అనారోగ్యం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. అయితే నిజానికి వారు అలా మాన‌సిక స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వారికే తెలియదు. కానీ వారిలో ఆ స‌మ‌స్య‌కు చెందిన ప‌లు ల‌క్ష‌ణాలు మాత్రం క‌నిపిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రిలోనైనా క‌నిపించే ప‌లు ల‌క్ష‌ణాల‌తో వారు మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా లేదా అనే విషయాన్ని ఇట్టే చెప్ప‌వ‌చ్చు. మ‌రి అలాంటి వారిలో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చేతి వేళ్ల‌లో ఉంగ‌రం వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే అలాంటి వారు schizophrenic స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతార‌ట‌. ప‌లువురు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం తెలిసింది. schizophrenic స‌మ‌స్య ఉన్న‌వారిని, లేనివారిని గ్రూప్‌లుగా విభ‌జించి వారి వేళ్ల‌ను ప‌రిశీలించ‌గా ఈ విష‌యం తెలిసింది.

2. um, uh, hmm అనే ప‌దాల‌ను ఎక్కువ‌గా ఉచ్చ‌రించే వారు కూడా సైకోపాత్‌లు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఎందుకంటే వీరు బ‌య‌ట‌కు ఒక‌టి అంటూ లోప‌ల మ‌రొక‌టి పెట్టుకునే వ్య‌క్తులుగా ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌. క‌నుక‌నే వారు సైకోపాత్ లు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

3. పైన ఇచ్చిన వీడియోలో ఉన్న రొటేటింగ్ ఇమేజ్‌ను చూశారా ? ఫేస్ తిరుగుతున్న‌ప్పుడు అందులో చాలా మందికి మ‌రొక ఫేస్ క‌నిపిస్తుంది. కానీ schizophrenia అనే మాన‌సిక స‌మ‌స్య ఉన్న‌వారికి మాత్రం అలా అనిపించ‌ద‌ట‌. అంతా నార్మ‌ల్‌గానే ఉన్న‌ట్టు అనిపిస్తుంద‌ట‌. అలా అని ఓ సైంటిస్టు బృందం ప‌రిశోధ‌న‌లు చేసి చెబుతోంది.

4. సైకోపాత్‌లుగా ఉండేవారు ముక్కుతో వాస‌న‌ల‌ను స‌రిగ్గా గ్ర‌హించ‌లేర‌ట‌. వారికి ఫ‌లానా వాస‌న అని చూపినా అది వారికి ఆ వాస‌న రాద‌ట‌. అలా అనిపించ‌ద‌ట.

5. మంచి ప‌నులు చేసే వారు కూడా సైకోపాత్‌లుగా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. డ‌బ్బులు దానం చేయ‌డం, పేద‌ల‌కు స‌హాయం చేయ‌డం వంటి ప‌నులు చేసే వారిలోనూ సైకోపాత్‌లు ఉంటార‌ట‌.

6. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై కామెంట్లు చేసే వారు కూడా సైకోపాత్‌లు, శాడిస్టులు అయి ఉంటార‌ట‌.

7. చుట్టూ ఉన్న మిగిలిన అంద‌రూ ఏదైన ఎమోష‌న్‌కు లోన‌వుతుంటే సైకోపాత్‌లు అలా లోను కార‌ట‌. కానీ వారు త‌మ‌కు అవ‌స‌రం ఉన్న సంద‌ర్భాల్లో మాత్రం బాగా ఎమోష‌న‌ల్ అవుతార‌ట‌.

8. సైకోపాత్‌ల‌కు అస్స‌లు భ‌యం ఉండ‌ద‌ట‌. ఏ విష‌యం ప‌ట్ల‌నైనా వారు అస్స‌లు భ‌య‌ప‌డ‌ర‌ట‌.

9. బిజినెస్‌, మేనేజ్‌మెంట్ వంటి జాబ్‌ల‌లో ప‌నిచేసే వారిలో 25 మందిలో ఒక‌రు సైకోపాత్‌లే అయి ఉంటార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top