మనుషి చిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను ఈ మధ్యే సాధించింది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన 6వ భారతీయ యువతిగా ఈమె రికార్డుకెక్కింది. ఫైనల్స్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన పోటీలో జడ్జిలు మెచ్చే విధంగా వారు అడిగిన ప్రశ్నకు ఈమె సమాధానం చెప్పడంతో ఈమెకు మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని కట్టబెట్టారు. అయితే ఇప్పుడు మనుషి చిల్లర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
1. మనుషి చిల్లర్ తల్లిదండ్రులు ఇద్దరూ మేథావులే. ఆమె తండ్రి డాక్టర్ మిత్రా బసు చిల్లర్ డీఆర్డీవోలో సైంటిస్టుగా పనిచేస్తుండగా, తల్లి డాక్టర్ నీలం చిల్లర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లయిడ్ సైన్సెస్‌లో న్యూరో కెమిస్ట్రీ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది. ఇక మనుషి చిల్లర్ ప్రస్తుతం సోనెపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసిస్తోంది. ఎప్పటికైనా గైనకాలజిస్టు కావాలన్నది ఆమె కల. అందులో భాగంగానే డాక్టర్ విద్యను మనుషి చిల్లర్ అభ్యసిస్తోంది.
2. మనుషి చాలా టాలెంటెడ్. చదువుల్లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఆమె ఇరగదీస్తుంది. కూచిపూడి నాట్యంలో ఆమె ఎక్స్పర్ట్. ప్రముఖుల వద్ద శిక్షణ తీసుకుంది.
3. మనుషి మంచి కవయిత్రి కూడా. చక్కని కవితలు రాస్తుంది. అంతేకాదు, ఫ్రీ టైంలో పెయింటింగ్‌లు కూడా వేస్తుంది.
4. జపాన్‌లో 2014లో నిర్వహించిన కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భారత్ తరఫున మనుషి పలు అంశాల్లో పార్టిసిపేట్ చేసింది.
5. మనుషికి ఎప్పటికైనా మిస్ వరల్డ్ టైటిల్ విన్ అవ్వాలనేది కోరిక. అది ఇప్పుడు నెరవేరింది. అంతకు ముందు ఫెమినా మిస్ ఇండియా 2017 టైటిల్ విన్నర్ అయింది. అయితే ఈ కీర్తిని అందుకోవడం కోసం ఆమె తన విద్యాభ్యాసంలో ఏడాదిని కోల్పోవాల్సి వచ్చింది.
6. మనుషికి స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, బంగీ జంపింగ్, పారా గ్లైడింగ్ వంటి సాహస కృత్యాలు అంటే ఇష్టం.
7. మనుషి చిల్లర్ మంచి సమాజ సేవకురాలు కూడా. ఆమె ప్రాజెక్ట్ శక్తి అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు రుతు క్రమంపై అవగాహన కల్పిస్తుంటుంది.
8. మనుషి చిల్లర్‌కు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఈమె సభ్యురాలు కూడా.
9. మనుషి ఇంగ్లిష్‌లో ఎక్స్పర్ట్. సీబీఎస్ఈ ఆలిండియా లెవల్లో నిర్వహించిన 12వ స్టాండర్డ్ పరీక్షల్లో ఇంగ్లిష్‌లో ఈమే టాప్‌గా నిలిచింది.
అందం మాత్రమే కాదు మంచితనంతో పాటు టాలెంట్ ఉన్న మహిళ “మనుషి చిల్లర్”. సింపుల్ గా చెప్పాలంటే “బ్యూటీ విత్ బ్రెయిన్” అని.