ప్రపంచంలోని 9 వింత వైధ్యాలు.!?

Siva Kumar

1. అస్తమాను తగ్గించడానికి చేప మందు వైద్యం :

అస్తమాను, శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి బ్రతికే ఉన్న చేప నుండి మందును తీసుకొని అస్తమాతో బాధపడే వారికి అందిస్తారు. నాలుక నుండి గొంతుద్వారా ఈ మందును ఇచ్చేటప్పుడు గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా ఆమందు వల్ల నయం అవుతాయి. ఈ మందు తీసుకున్న తర్వాత 45 రోజులపాటు ఆహారం విషయంలో పత్యం పాటించాలి. 1845లో ఒక హిందూ గురువు నుండి బతిని గౌడ్ కుటుంబం వారసత్వంగా చేసుకొని ఈ మందును ఆ వ్యాధి గ్రస్తులకు అందిస్తోంది.
FreakyRemedies31
2. జలగలతో వైద్యం:
మన శరీరంలో రక్తం గడ్డకట్ట ఉండేందుకు రక్తం ఫ్లో సాఫీగా సాగడానికి జలగలను మన శరీరంపై వదులుతారు. నిజంగా జలగలు మన శరీరంలో ఉండే రక్తాన్ని జలగలు పీల్చేస్తాయి. అయితే కొన్ని పెప్టైడ్స్ వల్ల రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. జలగలతో ఈ వైద్యం చేయడం ద్వారా గాయాలు కూడా తొందరగా నయమవుతాయి. ప్రస్తుతం వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ మరియు మైక్రో సర్జరీలో ఉపయోగిస్తున్నారు.
FreakyRemedies2
3. శరీరంపై ఉన్న దురదలు, మచ్చలను పోగొట్టడానికి డాక్టర్ ఫిష్ వైద్యం:
మన శరీరంపై కొందరికి ఎప్పుడూ దురదలు, చిన్న గాయం అయిన తొందరగా నయంకాదు. గర్ర రూఫ అనే డాక్టర్ కొలనులో, టర్కీ నదులలో ఉండే కొన్ని చేపలను ఉపయోగించి ఈ  వైద్యం  చేస్తాడు. ఇలా చేపలు మన శరీరాన్ని తాకడం వలన దురదలు, ఎర్రటి మచ్చలు నయం అవుతాయి. అయితే ఒకప్పుడు ఈ వైద్యం అందుబాటులో ఉన్నా యుఎస్, కెనడాలలో బ్యాన్ చేయడంతో ప్రస్తుతం ఈ వైద్యం చేయడం లేదు.
FreakyRemedies8
4. కప్పులను శరీరంపై బోర్లించి:
శరీరంపై కప్పులను బోర్లించి మధ్యమధ్యలో మంటను ఆ కప్పులకు ఆనిస్తూ,లేదా అలా ఒంటిపై ఉంచిన కప్పులకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా బాడీలో ఉన్న నొప్పులు, కండరాల బలహీనతలు, ప్రెజర్స్ తొలగుతాయని చెబుతున్నారు.  కొందరు హాలీవుడ్ నటులు ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారట.
FreakyRemedies9
5.మూత్ర వైద్యం:
మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు తొలగిపోవడానికి,అలాగే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటానికి ఎవరి మూత్రం వారు సేవించడం, స్నానానికి ఉపయోగించటం వలన ఆరోగ్యంగా ఉంటారట. మన దేశంలో గోమూత్రాన్ని ఆరోగ్యం బాగా ఉండాలని సేవిస్తారు తెలుసుకదా.
FreakyRemedies10
6. డిప్రెషన్ తగ్గించడానికి షాక్ ఇవ్వడం:
ఒత్తిడిని నుండి బయటపడటానికి ఈ ట్రీట్ మెంట్ ను ఉపయోగిస్తారు. అలాగే బైపోలార్ దిజార్డర్, కాటటోనియా వంటి వ్యాధులు నయం కావడానికి దీన్ని వాడతారు.1930లో మొదలైన ఈ వైద్యాన్ని ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఇలా ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారు.
FreakyRemedies12
7. మల బ్యాక్టీరియా:
ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క మలాన్ని ఆ వ్యక్తి శరీరం నుండి తీసుకొని ఇతనికి సరఫరా చేస్తారు. ఇలా చేయటం ద్వారా వ్యాధిగ్రస్తుడికి విధి నయం అవుతుందట. మైక్రోఫ్లోరర్లాను పంపిస్తారు. నార్త్ అమెరికా మరియు యూరప్ లలో ఈ వైద్యాన్ని చేస్తున్నారు.
FreakyRemedies6
8. శీతల వైద్యము:
చెడు కణాల పెరుగుదల మరియు పునరుత్పత్తి కాకుండా చేస్తూ మంటను తగ్గిస్తుంది. ఎలాంటి నొప్పి కలిగినా  నొప్పి తొందరగా నయం అవుతుంది.   రక్త నాళాల నిర్మాణం ప్రోత్సహించడానికి, చెర్మంపై మొటిమలు,మచ్చలు రాకుండా శరీర సంబంధ వ్యాధులు కలగకుండా చాలా తక్కువ టెంపరేచర్ లో ఈ వైద్యాన్ని అందిస్తారు.
తరచుగా ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు.
FreakyRemedies4
9. పాములతో మసాజ్ చేయడం:
ఒత్తిడి తగ్గించడానికి,పనిఒత్తిడి ఉపశమనం పొందడానికి, కండరాల బలహీనతను తగ్గించడానికి ఇలల పాములతో మసాజ్ చేస్తారు. ఇండోనేషియాలోని బలిలో ఇలా పాములతో వైద్యం చేస్తారు.
FreakyRemedies11

Comments

comments