మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత, 25 అడుగుల లోతు..6 రోజులుండి ప్రాణాలతో భయటపడ్డ సైనికుడి వీడియో.

45 డిగ్రీల మైనస్ సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రత, 25 అడుగుల లోతు 6 రోజులు… ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు లాన్స్ నాయక్ హనుమంతప్ప. సముద్ర మట్టానికి 19వేల అడుగుల ఎత్తులో ఉండే సియాచిన్ ప్రాంతంలో వారంరోజుల క్రితం మంచు చరియలు విరిగిపడటంతో అక్కడ సరిహద్దు భద్రతావిధులు నిర్వహిస్తున్న 10 మంది సైనికులు చిక్కుకున్నారు. ఆ 10 మంది సైనికులలో లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రమే సజీవంగా మిగిలాడు. ఇతను కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ జిల్లాకు చెందినవాడు.

మంచు చరియల్లో పడి చిక్కుకున్న ఆ సైనికులను గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ , డాగ్ స్క్వాడ్స్, డ్రిల్లింగ్ మిషన్స్ ల సహాయంతో ముమ్మరంగా ప్రయత్నించగా, రిస్క్ ఆపరేషన్ తర్వాత హనుమంతప్ప మాత్రమే సజీవంగా ఉన్నాడని ఆర్మీ అధికారులు తెలిపారు. మిగతా 9 మంది మరణించినట్లు తెలిపారు. అందరూ మృతి చెందగా, ఒక్క హనుమంతప్ప మాత్రమే సజీవంగా బ్రతకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఐతే 25 అడుగుల లోతులో, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో హనుమంతప్ప బ్రతకడానికి గల కారణం లేకపోలేదు. కొంత మేరకు మంచు తొలగించుకొని సహాయం కోసం ఎదురుచూడటం,సహజ సిద్ధంగా మంచులో గాలి వెళ్ళే చోటున ఉండటం, తను వేసుకున్న దుస్తులు శరీరాన్ని వెచ్చగా ఉండటం, అలాగే మూత్ర విసర్జన చేయకపోవడం వలన ఒంట్లో వేడి నిలిచిపోతుంది. ఇలా హనుమంతప్ప బ్రతకడు. హనుమంతప్ప మృత్యుoజయుడు కాబట్టే ఆ మంచుగడ్డల మధ్య బ్రతకగలిగాడు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్ లో హనుమంతప్ప చికిత్స పొందుతున్నాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top