840 ఏళ్ల క్రితం ఇక్క‌డే పుట్టానని., తాను కూర్చున్న ప్రదేశాల్ని చూపిస్తున్న భూటాన్ యువ‌రాజు.!

నాగార్జునకొండ ప్రాంతంతో తనకు పూర్వజన్మ సంబంధం ఉన్నట్లు భూటాన్ యువరాజు వెరోచా నారింపో తెలిపాడు. భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ కొడుకైన‌ 3 ఏళ్ల వెరోచా నారింపో గ‌త కొన్ని రోజులుగా….జలాశయాంలో ఉన్న బుద్ధుని విగ్రహం దగ్గరకు లాంచీలో వెళ్లాలని నత్తినత్తిగా పలుకుతున్నాడని భూటాన్ రాణి తల్లి అసిదోర్జి చెప్పారు.అయితే ఈప్రాంతం గురించి తెలుసుకోవటానికి చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని, చివ‌ర‌కు ఆచూకీ తెలుసుకొని ఇక్క‌డి ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.

అయితే …నాగార్జున సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన యువ‌రాజు వెరోచా….తాను 840 సంవత్సరాలకు పూర్వమే భారత్ లో పుట్టానని.. నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని చెబుతున్నాడు. అంతేకాదు…తాను తిరిగిన ప్ర‌దేశాల‌ను, కొండ‌పై తాను కూర్చున్న ప్ర‌దేశాల‌ను సైతం త‌న అమ్మ‌మ్మ‌కు చూపిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. తనకు కలలో ఐదు తలల పాము కనిపిస్తోందని.. అప్పట్లో ఆ పాము నాగార్జున కొండపై తిరిగేదని అంటున్నాడు. ప్రస్తుతం కొండపై ఉన్న విగ్రహం అప్పట్లో నది మధ్యలో ఉండేదని చెబుతున్నాడు.

నాగార్జున కొండ విశేషాలు.
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, క్రీ.పూ.2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ ప్రదర్శనశాల లో భద్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.

Comments

comments

Share this post

scroll to top