5 సార్లు MP, 4 సార్లు MLA…83 సంవతసరాల వయసులో 58 పెళ్లిళ్లు చేసుకున్నారు.! ఎందుకో తెలుసా?

83 ఏళ్ల వ్యక్తి..ఒంటి మీద కేవలం దోతీ తప్ప ఏ వస్త్రంధరించని వ్యక్తి..ఎంపీ గా గా,ఎమ్మెల్యే గా ఎన్నికైన వ్యక్తి..మరో విశేషం ఏంటంటే 58 పెళ్లిల్లు చేసుకున్న వ్యక్తి..ఒక విషయానికి మరొకదానికి పొంతన కుదరట్లేదు కదా..అన్ని విషయాలు ఒక వ్యక్తి కి సంభందించినవే అతనే ఝార్ఖండ్ కి చెందని బాగున్ సంబ్రాయ్..

బాగున్ సంబ్రాయ్  ఐదుసార్లు  ఎంపీ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన ఒక విచిత్రమైన వ్యక్తి. . బాగున్ తన శరీరం పైభాగంలో ఎటువంటి ఆచ్చాదన లేకుండా,చలి కాలం, వేసవికాలం, వర్షాకాలం.. ఇలా ఏ కాలంలో  అయినా కేవలం ధోతీనే ధరిస్తారు.స్వాతంత్ర సమర యోధులు మహాత్మా‌గాంధీ, వినోభా భావేల స్ఫూర్తితో థోతీ ధరిస్తున్నానని బాగున్ తెలిపారు..ఇతనిలో ఉన్న ఇంకో విషయం ఏమంటే.. అతనికి లెక్కలేనన్ని పెళ్లిళ్లు జరగడం …ఇతనికి ఇప్పటికి  58 పెళ్లిళ్లు జరిగాయని స్థానికులు చెబుతుంటారు.ఇన్ని పెళ్లిల్లు చేసుకోవడం వెనుక గల కారణాన్నీ ఇటీవల ఆయన ఒక సంధర్బంలో తెలిపారు..అదేంటంటే..

‘గతంలో ఈ ప్రాంతంలో ఆదివాసీ జాతరలు అధికంగా జరిగేవి. ఇక్కడకు వచ్చే వ్యాపారులు ఆదివాసీ స్త్రీలను లైంగికంగా వేధించేవారు. ఈ నేపధ్యంలో కొందరు గర్భం ధరించేవారు. మరికొందరు తీవ్ర అనారోగ్యాల బారిన పడేవారు. అలాంటివారందరికీ చేయూత అందించాను. దీంతో చాలామంది నన్ను భర్త అని చెప్పుకుంటూ, నా దగ్గర పని చేసేవారు. అయితే వారికి సరైన జోడీ దొరికినపుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఈ విధంగా నా జీవితంలో ఎంతో మంది స్త్రీలు వచ్చి వెళ్లిపోయారు అని చెప్పుకొచ్చాడు..విషయం ఏమంటే వీరిలో చాలామంది పేర్లు అతనికి కనీసం తెలీదు..కొందరి పేర్లు గుర్తు కూడా లేవు…

Comments

comments

Share this post

scroll to top