విజయ్ "తేరీ" టీజర్…. FB లో ట్రెండింగ్! అందుకేనా రజినీ తర్వాత అంత ఫాలోయింగ్ మనోడికి!

కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్. ఆయన సినిమాలు డిజాస్టర్ అయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ సునామీ సృష్టించాల్సిందే. తాజాగా విజయ్ 59వ చిత్రంగా ‘రాజారాణి’ ఫేం అట్లీ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న చిత్రం ‘తెరి’.యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ను తాజాగా విడుదలచేయగా ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

‘ట్వింఖిల్ ట్వింఖిల్ లిటిల్ స్టార్’ అంటూ టీజర్ మొదలవ్వగా పవర్ పోలీస్ ఆఫీసర్  విజయ్ కుమార్ గా విజయ్ ఎంట్రీ అదుర్స్. ఇక పోనీ టెయిల్ తో మరో పాత్రలో విజయ్ కనిపిస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంతా, ఎమీజాక్సన్ నటిస్తున్నా టీజర్ లో మాత్రం వారిద్దరికీ చోటులేదు. ప్రభు, రాధికా శరత్ కుమార్ మరో కీలకపాత్రలలో కనిపించనున్నారు.  జివి.ప్రకాష్ కుమార్ నేఫధ్య సంగీతం సూపర్బ్ గా ఉంది. జివి.ప్రకాష్ కు 50వ చిత్రం ‘తెరి’. జార్జ్ సి.విలియమ్స్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. చిత్ర టీజర్ చివర్లో ఖైదీల మధ్య విజయ్ నడుచుకుంటూ, స్టిక్ పట్టుకొని భయపెట్టే సీన్ హైలెట్ గా ఉంది. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top