కాశ్మీర్‌లో 8 ఏళ్ల‌ బాలిక‌పై అత్యాచారం, హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు వీడే.. వీడిని ఏం చేస్తే బాగుంటుంది..!

మ‌న భార‌త దేశం స‌నాత‌న ధ‌ర్మాల‌ను పాటించే దేశం. ఆచారాలు, సంస్కృతి, సాంప్ర‌దాయాలకు పుట్టిన‌ల్ల‌ని గ‌ర్వ‌ప‌డుతాం. ప్ర‌పంచానికి మ‌నం నాగ‌రిక‌త‌ను నేర్పిస్తున్నామ‌ని అనుకుంటాం. స్త్రీల‌ను గౌర‌వించే ఏకైక దేశమ‌ని గొప్పగా ఫీల‌వుతాం. ఎన్నో మ‌తాలు, కులాల‌కు చెందిన వారంతా క‌ల‌సి క‌ట్టుగా భార‌తీయులుగా ఉంటున్నామ‌ని సంతోషిస్తాం. కానీ.. కొన్ని సంఘ‌ట‌నలు జ‌రిగినప్పుడు మాత్రం మ‌నం మ‌న భార‌త దేశంలోనే ఉన్నామా.. అనిపిస్తుంది. అలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వారిని ఏం చేయ‌లేక‌పోతున్నామే.. అన్న బాధ క‌లుగుతుంది. వారిని ఏమీ చేయ‌లేమా..? అనే సందేహం క‌లుగుతుంది. చివ‌ర‌కు అలాంటి వారు మ‌న‌కు ఎదురైతే ప‌రిస్థితి ఏమిటి ? అన్న భ‌యం కూడా ఆవ‌హిస్తుంది.

చిత్రంలో ఉన్న నీచున్ని చూశారు క‌దా. వాడికి నీచుడు అనే ప‌దం కూడా చాలా త‌క్కువ‌. పైన చెప్పాం క‌దా.. కొన్ని ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డేవారిని ఏం చేయ‌లేక‌పోతున్నామే అన్న బాధ క‌లుగుతుంద‌ని, వారిని చూస్తే భ‌య‌మేస్తుంద‌ని.. అలాంటి కోవ‌కు చెందిన వాడే వీడు. వీడు చేసింది అతి నీచాతి నీచ‌మైన ప‌ని.. చేసేది ఆల‌య పూజారి ఉద్యోగం. చూస్తే అభం శుభం తెలియ‌ని అమాయ‌కుడిలా ఉంటాడు. కానీ వాడు మాత్రం న‌ర‌రూప రాక్ష‌సుడు. 8 ఏళ్ల బాలిక‌కు మ‌త్తు మందిచ్చి చిత్ర హింస‌లు పెడుతూ ఆమెపై అత్యాచారం చేయ‌డ‌మే కాదు, మ‌రికొంద‌రిని ఆ ప‌నికి పుర‌మాయించాడు. వారి నీచ‌మైన ప‌నికి ప‌విత్ర‌మైన ఆల‌యాన్ని ఎంచుకోవ‌డం దారుణ‌మైన విష‌యం. ఇక ఇందులో మ‌రో సిగ్గుమాలిన విష‌యం ఏమిటంటే.. వీడు త‌న కొడుకు, మేన‌ల్లుడితో కూడా ఆ బాలిక‌పై అత్యాచారం చేయించాడు. వీడి పేరు సాంజీరాం.

సాంజీరాం ఇప్పుడు ఆ బాలిక కేసులో ప్ర‌ధాన నిందితుడు. జ‌మ్మూ కాశ్మీర్‌లోని క‌తువాలో ఆసిఫా బానో అనే బాలిక‌పై వీడు, వీడి వ‌ర్గీయులు అత్యంత కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తించి ఆమెను చంపేశారు. దీంతో సాంజీరాంతో స‌హా మరో 7 మందిపై కేసు న‌మోదైంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇక ఇందులో మ‌రీ నీచ‌మైన విష‌యం ఏమిటంటే… జ‌మ్మూ కాశ్మీర్‌కు చెందిన అధికార బీజేపీ పార్టీ మంత్రులే సాంజీరాం లాంటి న‌ర‌రూప రాక్ష‌సుల‌ను విడుద‌ల చేయాల‌ని జాతీయ జెండాలతో ర‌హ‌దారుల‌పై ర్యాలీ తీశారు.. ఇదీ.. మ‌న భార‌తం. మ‌న దేశంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తంతు.. ఇలాంటి వారు అధికారంలో ఉంటే ఇక బాధితుల‌కు న్యాయం ఎలా జ‌రుగుతుంది చెప్పండి. న్యాయం ఆశించ‌డం కూడా అత్యాశే అవుతుంది. ఏది ఏమైనా సాంజీరాం లాంటి న‌ర‌రూప రాక్ష‌సుల‌కు అత్యంత దారుణ‌మైన శిక్ష వేయాలి. అప్పుడే ఇలాంటి ప‌నులు చేసే వారికి వెన్నులో వ‌ణుకుపుడుతుంది..!

Comments

comments

Share this post

scroll to top