ఈ 8 సినిమాల్లో “రష్మీ” నటించింది…కానీ మీరు గమనించి ఉండరు..! అవేంటో మీరే చూడండి..!

జబర్దస్త్ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది యాంకర్ రష్మీ.కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ప్రోగ్రామ్లో యాంకర్ గా ఏకచత్రాదిపత్యం వహిస్తుంది రష్మీ.అనసూయ ఉన్నప్పటికీ తనదైన ముద్ర వేస్తుంది.యాంకరింగ్ కి గ్లామర్ సొగసులు అద్దిన యాంకర్ గా రష్మీని చెప్పొచ్చు.జబర్దస్త్ చేస్తూ గుంటూరు టాకీస్,ఇప్పడు నెక్స్ట్ నువ్వే సినిమాలు చేసింది.జబర్దస్త్ కి ముందు కూడా రష్మీ సినిమాల్లో నటించింది కానీ తననెవరూ గుర్తించలేదు,తగినంత గుర్తింపూ రాలేదు..ఆ సినిమాలేంటో తెలుసా..

వెల్ డన్ అబ్బా

భారతదేశం గర్వించదగ్గ ఉత్తమ దర్శకులలో  శ్యామ్ బెనెగల్ ఒకరు.అతని దర్శకత్వంలో రష్మి పనిచేసిందంటే నమ్మబుద్ది కావడం లేదు కదూ..కానీ నిజం..వెల్ డన్ అబ్బా సినిమాలో టివి రిపోర్టర్ పాత్రపోషించింది రష్మీ.ఈ సినిమా కథ రాజకీయ వ్యంగ్యానికి సంభందించిన కథ.హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగిన కథ..విమర్శకుల ప్రసంశలు పొందిన సినిమా.శ్యామ్ బెనగల్ సినిమాలో అవకాశం రావడం గ్రేట్..బట్ రశ్మీని ఎవరూ గుర్తించకపోవడం సాడ్..

హోలీ

హోలీ  సినిమాలో రిచా,ఉదయ్ కిరన్ హీరో హీరోయిన్లుగా నటించారు.కమెడియన్ కు సునీల్ కి జంటగా ఈ సినిమాలో రష్మీ నటించింది.హోలీ సినిమాలో రష్మీని గుర్తుపట్టినవారు చాలా తక్కువ మంది.రష్మీ ఇండస్ట్రీకి పరిచయం అియంది కూడా ఈ సినిమాతోనే..ఈ సినిమా తర్వాత సునీల్ హీరోగా ఎక్కడికో వెళ్లిపోయాడు.రష్మీ మాత్రం చిన్న పాత్రలకు పరిమితమైపోయి,జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.

ప్రస్థానం

శర్వానంద్ సినిమాలంటే నటించిన ప్రతొక్కరి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.ఈ సినిమా ద్వారానే సందీప్ కిషన్ పరిచయమయ్యాడు.సందీప్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ పోషించగా,నదియా అనే అమ్మాయి పాత్రలో రష్మీ నటించింది.విమర్షకుల ప్రశంసలు పొందింది ఈ  సినిమా ,రష్మీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.అవకాశాలు మాత్రం రాలేదు.

బిందాస్

మంచు మనోజ్ నటించిన బిందాస్ ఫుల్లీ ఎంటర్టైనర్ మూవీ.ఈ సినిమాలో మనోజ్ మరదలిగా రష్మీ నటించింది.బావను ప్రేమించి,ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి,చివరి నిమిషంలో కాదనుకునే మరదలి పాత్ర పోషించగా,రష్మీ మూలంగా చేయని తప్పుకు తన వాళ్లకు దూరమయ్యే పాత్రలో మనోజ్ నటించారు.ఈ సినిమాలో కూడా రష్మీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

కరెంట్

సుశాంత్ మరియు స్నేహ ఉల్లాల్ నటించిన 'కరెంట్' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలు గీతగా 
రష్మి మంచి పాత్ర పోషించింది. ఈ చిత్రంలో హీరో స్నేహితుడైన వెన్నెల కిషోర్ రష్మిని ఆకట్టుకోవడానికి 
ప్రయత్నిస్తుంటే,రష్మీ అతనిని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఈ 2009 రొమాంటిక్ ఎంటర్టైనర్ లో తన 
నటనకు ప్రేక్షకుల మధ్య రష్మికి కొంత గుర్తింపు వచ్చింది.
 

గణేష్

కాజల్ ,రామ్ జంటగా నటించిన గణేష్ సినిమాలో రష్మీ అర్చనగా నటించింది.ప్రేమ విషయంలో సమస్యలు ఎదుర్కోంటున్న అమ్మాయిగా రష్మీ నటించగా వాటిని పరిష్కరించే స్నేహితుడి పాత్రలో రామ్ నటించారు.ఈ సినిమా లో రష్మీ కనపడినప్పటీకి తనకొచ్చిన గుర్తింపు చాలా తక్కువ.

థ్యాంక్స్

థ్యాంక్స్ సినిమాలో వినీత్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.ఆది కేరాఫ్ ఎబిఎన్ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించింది ఈ సినిమాలేవీ రష్మీకి గుర్తింపు నివ్వలేదు.

ఆది కేర్ ఆఫ్ ఏ బీ ఎన్ కాలేజీ:

Comments

comments

Share this post

scroll to top