77 ఏళ్ల వ‌య‌స్సులో 47వ సారి 10 వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు రాస్తున్న తాత‌..! పాసైతేనే పెళ్లి చేసుకుంటాడ‌ట‌..!

సాధార‌ణంగా 10వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌లే కాదు, ఆ త‌రువాత త‌ర‌గ‌తుల్లో వచ్చే ఏ ప‌రీక్ష‌లోనైనా ఫెయిలైతే దాన్ని మ‌ళ్లీ రాయాల్సిందే. అయితే ఎవ‌రైనా ఏ ప‌రీక్ష‌నైనా పాస్ అవుతామ‌న్న గ్యారంటీ ఉంటే 1,2 సార్లు ప్ర‌య‌త్నిస్తారు. అయిన‌ప్ప‌టికీ పాస్ కాక‌పోతే ఆ ప‌రీక్ష‌ల‌ను అలాగే వదిలేసి ఫెయిల్ అనే ముద్ర‌తోనే కాలం వెళ్ల‌దీస్తారు. అయితే రాజ‌స్థాన్‌కు చెందిన ఓ వృద్ధుడు మాత్రం అలా కాదు. 77 ఏళ్ల వ‌య‌స్సులోనూ 47వ సారి త‌న 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను రాస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాడు.
రాజ‌స్థాన్‌లోని ఆల్వే ప్రాంతానికి చెందిన ఖోహ‌రి గ్రామ వాసి శివ్ చ‌ర‌ణ్ యాద‌వ్ కు ఇప్పుడు 77 ఏళ్లు. ఆయ‌న 2 నెల‌ల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే త‌ల్లి మృతి చెందింది. 10 ఏళ్ల వ‌య‌స్సు రాగానే తండ్రి కూడా స్వ‌ర్గ‌స్తుడ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే తమ పూర్వీకుల నుంచి సంక్ర‌మించిన ఓ ఇంట్లో అత‌ను గ‌త 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. అయితే అత‌ను తాను అనుభ‌వించిన క‌ష్టాల‌ను దృష్టిలో ఉంచుకుని 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లలో పాస్ అయ్యాకే వివాహం చేసుకోవాల‌ని తీర్మానించుకున్నాడు.
150611154804_shiv_charan_at_exam_center_624x351_ayadav_1457074367
కాగా శివ్ చ‌ర‌ణ్ యాద‌వ్ 1968లో మొట్ట మొద‌టి సారిగా 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశాడు. కానీ కేవ‌లం కొన్ని స‌బ్జెక్టుల‌లో మాత్ర‌మే తాను పాస్ అయ్యాడు. అలా ఆ ఏడాది మొద‌లుకొని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఏటా బోర్డు ప‌రీక్ష‌లు రాస్తూనే ఉన్నాడు. కానీ రాజ‌స్థాన్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ బోర్డ్ క‌ఠిన‌మైన నియ‌మ నిబంధ‌న‌ల వ‌ల్లో, లేదా అత‌ని దుర‌దృష్టం వ‌ల్లో కానీ ఏటా ప‌రీక్ష‌ల్లో ఫెయిల‌వుతూనే ఉన్నాడు. ఒక సారి గ‌ణితం, సైన్స్‌ల‌లో పాస్ అయితే హిందీ, ఇంగ్లిష్‌ల‌లో ఫెయిల్ అయ్యే వాడు. మ‌రోసారి మ‌రో స‌బ్జెక్టులో ఫెయిల్ అయ్యే వాడు. అలా తాను 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసిన ప్ర‌తి సారీ పాస్ అయ్యే వాడు కాదు. ఈ క్ర‌మంలోనే గ‌డిచిన 1995వ సంవ‌త్స‌రంలో త‌న లక్ష్యానికి అత్యంత చేరువ‌గా వ‌చ్చాడు. కానీ ఆ ఏడాది అనుకోకుండా గ‌ణితంలో ఫెయిల్ అయ్యాడు.
అయితే అన్ని సార్లు ఫెయిల్ అయిన‌ప్ప‌టికీ ఆ తాత త‌న పట్టుద‌ల‌ను ఏమాత్రం కోల్పోలేదు. ఈ ఏడాది ప‌లువురు అధ్యాప‌కుల వ‌ద్ద త‌ర‌గ‌తుల‌కు వెళ్లానని, ఈ సారి ఎలాగైనా పాస్ అవుతాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు. అన్న‌ట్టు, ఇప్పుడీ తాత 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాయడం ఎన్నో సారో తెలుసా? అక్ష‌రాలా 47వ సారి. అవును, స‌రే మ‌రి… ఈ సారైనా ఆయ‌న 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌న్నింటిలోనూ పాస్ అవ్వాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం. ఏదేమైనా ఆ తాత ప‌ట్టుద‌ల‌కు మాత్రం హ్యాట్సాఫ్‌..!

Comments

comments

Share this post

scroll to top