చిన్న‌ప్పుడు మ‌న పేరెంట్స్ మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డానికి ఉప‌యోగించిన 7 సంద‌ర్భాలు.!! 3 వ ది అందరు ఎదుర్కొనే ఉంటారు!

చిన్న‌ప్పుడు మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డానికో, మ‌న అల్ల‌రిని మాన్పించ‌డానికో మ‌న పేరెంట్స్ ర‌క‌ర‌కాల భ‌యాలు క‌ల్గిస్తుంటారు. అందులో ఇప్పుడు 7 విష‌యాలను మ‌నం ఓ సారి గుర్తుచేసుకుందాం.. ఎందుకా భ‌యాలు క‌ల్పించారు-దాని అంత‌రార్థం ఏంటి? అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.!

క‌ల్పించిన భ‌యం:పండ్ల గింజలు తింటే…. క‌డుపులో చెట్లు మొలుస్తాయి.!
దీనికి గ‌ల కార‌ణం:చిన్న పిల్ల‌ల‌కు పండ్ల గింజ‌లు అర‌గ‌వు కాబ‌ట్టి…ఇలాంటి భ‌యాన్ని క్రియేట్ చేస్తారు.

క‌ల్పించిన భ‌యం:అన్నం తిన‌క‌పోయినా, అల్ల‌రి చేసినా, చెల్లిని కొట్టినా … బూచోడొచ్చి ప‌ట్టుకుపోతాడు.!
దీనికి గ‌ల కార‌ణం: ఇది కేవ‌లం మ‌న‌ల్ని మంచి దారిలో పెట్ట‌డానికి యూజ్ చేసే ట్రిక్.!

క‌ల్పించిన భ‌యం: రాత్రి పూట దేవుడొచ్చి…అమ్మ‌నాన్న మ‌ద్య ప‌డుకున్న మ‌న‌ల్ని వేరే ద‌గ్గ‌ర ప‌డుకోబెడ‌తాడు.!!
దీనికి గ‌ల కార‌ణం: వారి లైంగిక కార్య‌క్ర‌మానికి అడ్డువ‌స్తార‌ని చిన్న‌పిల్ల‌ల్ని వేరే ద‌గ్గ‌ర ప‌డుకోబెడ‌తారు.!

క‌ల్పించిన భ‌యం: చూయింగ‌మ్ తింటే క‌డుపులోప‌ల అతుక్కుపోతుంది.!
దీనికి గ‌ల కార‌ణం:చూయింగ‌మ్ హానిక‌రం కాబ‌ట్టి దానిని తినొద్ద‌నే ఉద్దేశ్యంతో ఇలాంటి అపోహ‌ను క్రియేట్ చేస్తారు.!

క‌ల్పించిన భ‌యం:వ‌క్క‌పొడులు తినొద్దు…అందులో బ‌ల్లి పెంట క‌లుపుతారు.!
దీనికి గ‌ల కార‌ణం: చూయింగ‌మ్ హానిక‌రం కాబ‌ట్టి దానిని తినొద్ద‌నే ఉద్దేశ్యంతో ఇలాంటి అపోహ‌ను క్రియేట్ చేస్తారు.!

క‌ల్పించిన భ‌యం:ఇంటి గ‌డ‌ప ముందు చెప్పులు తిర‌గ‌ల పెడితే…. ల‌క్ష్మీదేవి మ‌న ఇంటికి రాదు !
దీనికి గ‌ల కార‌ణం:ఎక్క‌డెక్క‌డో తిరిగిన చెప్పులు రివ‌ర్స్ ఉంటే..దానిని చూడ‌డం జుగుస్స‌గా ఉంటుంది.!

క‌ల్పించిన భ‌యం:ఇంటి గొళ్లెం చ‌ప్పుడు చేస్తే….. అయిన వాళ్ల‌తో గొడ‌వ‌ల‌వుతాయి.!
దీనికి గ‌ల కార‌ణం:డిస్ట‌ర్బెన్స్ ను కంట్రోల్ చేయ‌డానికి ఈ అపోహ‌ను సృష్టించారు.

Comments

comments

Share this post

scroll to top