శృంగార సామ‌ర్థ్యం, వీర్యం ఉత్ప‌త్తిని పెంచే అద్భుత‌మైన, స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధాలు ఇవే తెలుసా..?

నేటి త‌రుణంలో స‌గ‌టు పౌరున్ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌లు ఎంత‌గా స‌త‌మ‌తం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప్ర‌ధానంగా పెళ్ల‌యిన దంప‌తుల్లో సంతానం క‌లిగే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి. శృంగార సామ‌ర్థ్యం లోపించ‌డం, పురుషుల్లో వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, ఒక‌వేళ అయిన‌ప్ప‌టికీ అందులో ఉత్తేజంగా ఉండే శుక్ర క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో చాలా మందికి పిల్లలు క‌ల‌గ‌డం లేదు. అయితే ఇప్పుడంటే ఈ స‌మ‌స్య‌ల‌ను తీర్చుకునేందుకు మెడిసిన్లు, వైద్యులు అందుబాటులోకి వ‌చ్చారు. కానీ ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఏం మందులు తీసుకున్నారు..? లేదు క‌దా.. మ‌రి వారిలో చాలా మంది ఒక్కొక్క‌రు గంపెడు మంది పిల్ల‌ల్ని ఎలా క‌నగ‌లిగారు..? అంటే.. అవును.. అందుకు కార‌ణం ఉంది. ఎందుకంటే.. వారు కూడా మందులు వాడేవారు. కానీ అవి ఆయుర్వేద ప‌ర‌మైన‌వి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. కుంకుమ‌పువ్వు
రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో చిటికెడు కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగాలి. దీంతో పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోతుంది. వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

2. అస్పార‌గ‌స్ (Asparagus)
ఇది మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ల‌లో దొరుకుతుంది. అస్పార‌గ‌స్‌ను తీసుకుని ఎండ‌బెట్టి పొడి చేయాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దానికి ఒక టీస్పూన్ నెయ్యి, చ‌క్కెర‌ల‌ను క‌ల‌పాలి. అనంత‌రం సేవించాలి. ఇలా రోజూ చేశాక వేడి పాలు తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌లు పోతాయి. పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది.

3. శిలాజిత్
దీన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. శిలాజిత్‌ను పొడి చేసి చిటికెడు మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో నెయ్యి లేదా తేనె క‌లిపి సేవించాలి. దీన్ని రోజూ తీసుకుంటే జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా అయి శృంగార సమ‌స్య‌లు పోతాయి.

4. చింత‌గింజ‌లు
చింత‌పండులో ఉండే గింజ‌ల‌ను తీసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడిపాలలో వేయాలి. అందులో కొద్దిగా చ‌క్కెర క‌ల‌ప‌వ‌చ్చు. అనంత‌రం పాల‌ను బాగా క‌లిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే వీర్య వృద్ధి చెందుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోతుంది.

5. అశ్వగంధ
ఇది కూడా మ‌న‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంఇ. దీని పొడిని ఒక టీస్పూన్ మోతాదు తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో వేసి రోజూ రాత్రి తాగితే చాలు. నెల రోజుల్లోనే శృంగార సామ‌ర్థ్యం రెట్టింప‌వుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది.

6. ఉసిరి
ఉసిరికాయ పొడి మ‌న‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో ల‌భిస్తుంది. దీన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా క‌లుపుకుని తాగితే దాంతో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. అంగ స్తంభ‌న స‌మ‌స్య పోతుంది.

7. పున‌ర్న‌వ
దీన్నే ప‌లు ప్రాంతాల్లో అటిక మామిడి అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో Boerhavia Diffusa అంటారు. ఈ మొక్క ఆకుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక టీస్పూన్ తేనెకు క‌లిపి రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అంగ స్తంభ‌న స‌మ‌స్య పోతుంది.

Comments

comments

Share this post

scroll to top