60 ఏళ్ల క్రితం ఇదేరోజున అంతరిక్షంలోకి వెళ్ళింది “లైకా” అనే కుక్క..! లైకా గురించి 7 ఆసక్తికర విషయాలు ఇవే.!

లైకా… అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరీ గగారిన్ కి స్పూర్తిదాత..శాస్త్రవేత్తల పరిశోధనలకోసం బలైపోయిన జీవి..తననెందుకు పరీక్షల కోసం తీసుకెళ్తున్నారు అని అడగడానికి,వద్దు అనడానికి నా అనేవరు లేని జీవి..కానీ లైకా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలకు మార్గాన్ని చూపించింది..లైకా..నోరులేని మూగ జీవి..ఒక ఊర కుక్క.. అంతరిక్షానికి చేరిన మొదటి జంతువులలో ఒకటి, మరియు భూకక్ష్యకు చేరిన మొదటి జంతువు.సరిగ్గా అరవై ఏళ్ల క్రితం ఇదే రోజున దీన్ని బాహ్య అంతరిక్షకక్ష్యలోకి ప్రయోగించింది రష్యా..ఈ రోజు లైకాని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. లైకా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  • లైకా అనేది ఒక సోవియట్ యూనియన్ స్పేస్ కుక్క..లైకా రష్యాలోని మాస్కో నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక ఊరకుక్క.
  • రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 2 ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవి.1957 నవంబరు 3  బాహ్య కక్ష్యలోకి దీనిని ప్రయోగించారు.  ప్రాణముండగా అంతరిక్షంలోకి ప్రవేశించిన జీవిగా చరిత్రలో నిలిచిపోయింది.
  • ఈ ప్రయోగమే జీవం ఉన్న ప్రయాణికుని కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని, అతను సూక్ష్మ గురుత్వాకర్షణను తట్టుకోగలడనే లక్ష్యాన్ని నిరూపించింది.
  • మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి యూరీ గగారిన్ కి లైకానే స్పూర్తి.1957 లో లైకా అంతరిక్షంలోకి వెళ్తే యూరీ 1961లో స్పేస్ లో అడుగుపెట్టారు.
  • తిరిగొచ్చే వీలులేని రాకెట్లో లైకా అంతరిక్షానికి వెళ్లింది అంటే లైకా ఇక రాదని శాస్త్రవేత్తలకు ముందుగానే తెలుసు.వారానికి సరిపడా ఆహారం ఉన్నప్పటికీ..కక్ష్యలోకి ప్రవేశించిన ఏడుగంటల్లోనే లైకా మరణించింది.కానీ ఆరురోజుల వరకు ప్రాణాలతో ఉందని ముందు చెప్పారు.తర్వాత 2002లో అసలు నిజం బయటపెట్టారు.
  • దీనికి కారణం ప్రాణవాయువు లేకపోవడం వలన అని శాస్త్రవేత్తలు వెల్లడించినప్పటికీ భూ కక్ష్యకు చేరిన తర్వాత అధిక వేడి తట్టుకోలేక లైకా మరణించింది.
  • ఈ ప్రయోగం తర్వాత అంతరిక్షంలోకి పంపిన ప్రతి జీవి సురక్షితంగా భూమిని చేరుకున్నాయి..సుమారు నలభైఏండ్ల తర్వాత రష్యా హీరోగా లైకా ని గుర్తించి,లైకాకి స్మారకాన్ని ఆవిష్కరించింది రష్యా ప్రభుత్వం.ఇది లైకా అమరత్వానికి రష్యా ఇచ్చిన గౌరవం.

Comments

comments

Share this post

scroll to top