హైదరాబాద్ “మెట్రో” లో భాగంగా గుర్తుపెట్టుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు, ప్రదేశాలు ఇవే.! పొరపాటు పడితే ఇక అంతే.!

ఇంటర్నెట్ ప్రపంచం వచ్చాక ప్రపంచం చాలా చిన్నగా అయింది కానీ..మన హైదరాబాద్ మాత్రం చాలా పెద్దగానే అనిపిస్తుంది.ప్రపంచంలో ఓ చోటు నుండి మరో చోటుకి ఎంత టైంలో వెళ్తామో చెప్పగలమేమో కానీ..మన భాగ్యనగరంలో మాత్రం ఒక చోటు నుండి ఇంకొ చోటు ఫలానా టైం లోపు చేరుకుంటాం అని పక్కాగా చెప్పలేం.ఎక్కడ చూసినా  ట్రాఫిక్ జాం…..హైదరాబాద్ లో ఎక్కడికైనా ప్రయాణం అంటే యుద్దానికి బయల్దేరడంతో సమానం..అలాంటి ట్రాపిక్ కి చెక్ పెట్టేందుకు చేపట్టింది మెట్రో రైల్…దాని గురించి కొన్ని విశేషాలు..

స్టేషన్లోకి ఎలా వెళ్లాలి

మెట్రోలో ప్రయాణించడానికి స్టేషన్‌కు వచ్చినవారికి మూడు మార్గాలుంటాయి..మెట్ల మార్గం రోడ్డుకి అటు ఇటు నాలుగు ఉ:టాయి..లిఫ్ట్ అయితే పిల్లలకు ముసలి వారికొరకే..రోడ్డుకు అటొకటి,ఇటొకటి రెండు లిఫ్ట్ లు ఉంటాయి.ఇక, రెండోది లిఫ్టు. ఇది వృద్ధులు, పిల్లలకు మాత్రమే. మెట్ల మార్గాల మధ్యలో రోడ్డుకు అటు ఒకటి, ఇటు ఒకటి చొప్పున రెండే లిఫ్టులు ఏర్పాటు చేశారు. అలాగే అటూ ఇటూ ఎస్కలేటర్లు కూడా ఉంటాయి. అంటే, స్టేషన్‌ దగ్గర ఏవైపుకు చేరుకున్నా మీరు ఎంచక్కా మొదటి అంతస్తుకు చేరుకోవచ్చు. అలాగే, మొదటి అంతస్తులోని పెయిడ్‌ ఏరియాకు చేరుకున్న ప్రయాణికులు రైలెక్కాలంటే రెండో అంతస్తుకు వెళ్లాలి. ఎలక్ట్రానిక్‌ గేట్లు దాటి మరో పది అడుగులు వేస్తే.. అక్కడ కూడా మెట్లు, ఎస్కలేటర్‌, లిఫ్టు  ఉంటాయి..వాటి ప్లాట్‌ఫాంకు చేరుకోవచ్చు.

టికెట్ తీసుకోవడం ఎలా

మొదటి అంతస్తుకు చేరాక అక్కడున్న టికెట్‌ వెండింగ్‌ మిషన్లు, టికెట్‌ కౌంటర్లులో  టోకెన్‌ తీసుకుని వెనక్కి తిరిగి పది అడుగులు వేస్తే.. టికెట్‌ ఫేర్‌ కలెక్షన్‌ సెంటర్‌ లేదా ఎలక్ట్రానిక్‌ గేట్లు ఉంటాయి.కొంచెం ముందుకెళితే షాపింగ్‌కి రీటెయిల్‌ షాపులు ఉంటాయి.  ముందుకెళితే ఎలక్ట్రానిక్‌ గేట్ల వద్దకు వెళ్లిపోవచ్చు. ఇక్కడి వరకూ అందరికీ ప్రవేశం ఉచితం. ఇక్కడ ఎంతసేపైనా ఉండొచ్చు. ఇది పబ్లిక్‌ ఏరియా అయితే, ఆ తర్వాత లోపలిది పెయిడ్‌ ఏరియా! టోకెన్‌, స్మార్ట్‌ కార్డు ఉంటేనే అక్కడికి ప్రవేశం.

పెయిడ్ ఏరియాలోకి వెళ్లడం ఎలా

ఎలక్ట్రానిక్‌ గేట్ల వద్దకు చేరుకున్న తర్వాత టికెట్‌ ఫేర్‌ కలెక్షన్‌ సెంటర్లో ఉన్న రీడర్ కు కొనుక్కున్న  టోకెన్‌ను  చూపించాలి. మెట్రో స్మార్ట్‌ కార్డు అయితే స్వైప్‌ చేయాలి. అప్పుడే ఎలకా్ట్రనిక్‌ గేట్లు తెరుచుకుంటాయి. వీటి ద్వారా మాత్రమే ప్రయాణికులు లోపలికి (పెయిడ్‌ ఏరియా)కు వెళ్లగలరు. ఇతరులు ఎవరూ వీటిని దాటి వెళ్లలేరు. ఇక్కడ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మనుషులను, బ్యాగేజీని చెకింగ్ చేసే మెషీన్స్ ఉంటాయి . రెండు వైపుల నుంచీ పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్లడం వీలవుతుంది.

కుడి ఎడమ అయితే పొరపాటే..

మొదటి అంతస్తులోని పెయిడ్‌ పార్కింగ్‌ నుంచి రెండో అంతస్తుకు వెళ్లే ముందే, ప్రయాణికులు గమ్య స్థానాన్నిబట్టి మెట్లు, లిఫ్టు, ఎస్కలేటర్లను ఎంచుకోవాలి. ఒకసారి ప్లాట్‌ఫాంకు చేరిన తర్వాత, అక్కడ అవతలి వైపునకు వెళ్లడానికి వీలుండదు. మళ్లీ మొదటి అంతస్తుకు వచ్చి పెయిడ్‌ పార్కింగ్‌ ద్వారా వెళ్లాల్సిందే. ఉదాహరణకు, మీరు సికింద్రాబాద్‌ స్టేషన్లో పెయిడ్‌ ఏరియాకు వెళ్లారు. నాగోల్‌ వెళ్లాలంటే ఒకవైపునకు, కూకట్‌పల్లి వెళ్లాలంటే మరో వైపునకు వెళ్లాలి. పొరపాటున అటూ ఇటూ మారిపోయారనుకోండి. ప్లాట్‌ఫాంకు వెళతారు. కానీ, అక్కడ మారడానికి ఉండదు. మొదటి అంతస్తుకు రావాల్సిందే..

ప్రయాణికులకు విజ్ణప్తి

మెట్రో స్టేషన్‌ కింద ఉన్న రోడ్డు భాగం నుంచి మొదలుకొని స్టేషన్‌లో మొదటి అంతస్తు, ఆ తర్వాత ప్లాట్‌ఫాం వరకూ వివిధ ప్రాంతాల్లో నాలుగు భాషల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ) సూచికల బోర్డులు, ఎలక్ర్టానిక్‌ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు మీద ఎంట్రీ మార్గంలో, మెట్ల మార్గాలు, లిప్టులు, ఎస్కలేటర్‌ వద్ద వీటిని ఉంచారు. నిరక్షరాస్యులకు సహాయం చేసేందుకు స్టేషన్‌ సిబ్బంది ఉంటుంది.

 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు,ప్రతి పదినిమిషాలకో బస్సు

 మెట్రో స్టేషన్‌ ప్రజలకు రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలుగా అందుబాటులోకి రానుంది. ఎవరైనా సరే, రోడ్డు దాటేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు.వీటికి టికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.  పబ్లిక్‌ ఏరియాలో షాపింగ్‌ కూడా చేసుకోవచ్చు .మెట్రోస్టేషన్ల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు రాగానే బస్సులు సిద్ధంగా ఉంచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.మెట్రో ప్రారంభానికి ముందే స్టేషన్ల నుంచి కాలనీలకు బస్సులు నడిపితే ప్రయాణికులు సంఖ్య తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
 

మెట్రోలో ఏమేమేం ఉంటాయి..అంధుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు..

మెట్రో రైలుకు 3 కోచ్‌లు ఉంటాయి. వీటిలో దాదాపు వెయ్యి మంది ప్రయాణికులు వెళ్లొచ్చు. కాకపోతే, వీటిల్లో కూర్చోవడానికి కుర్చీలుండవు,పోడవాటి బల్ల ఉంటుంది.దీనిపై నలభై మంది వరకు కూర్చోవచ్చు,మిగతావారు నిల్చోవాల్సిందే, మొబైల్‌, ల్యాప్‌టాప్ లు చార్జింగ్‌ చేసుకోవడానికి పాయింట్లు ఉంటాయి.వికలాంగులకు ప్రత్యేక సీట్లుంటాయి. అందులు రోడ్డు మీద నుంచి మెట్రో స్టేషన్‌లో అడుగు పెట్టింది మొదలు రైలులో ప్రయాణం చేసి కిందకు వెళ్లే వరకు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.అంధులు నడిచే సమయంలో అనువుగా ఉండేలా టైల్స్‌ను ఏర్పాటు… వీల్‌ చైర్‌తో మెట్రో రైలు ఎక్కడం, దిగడం, రైల్లో ప్రత్యేకంగా సీట్ల కేటాయింపులు..దేశంలోని ఇతర మెట్రోల కన్నా హైదరబాద్‌ మెట్రో అంధులు, వికలాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక గుర్తింపునిచ్చి, దానికనుగుణంగానే ఏర్పాట్లు చేశారు.
 

అమీర్ పేట్,మియాపూర్,నాగోల్ ప్రత్యేకతలు…

నాగోల్ కి అంతర్జాతీయ ఖ్యాతీ రానుంది.  దానికి కారణం మొదటి దశ మెట్రో రైలు నాగోల్‌ నుంచే ప్రారంభం అవుతోంది. ఈ స్టేషన్‌ కేంద్రంగా ఉప్పల్‌ డిపోను 100 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో 2015 ఉగాదినాటికే సిద్ధమైంది. మొదటి మెట్రో రైలు నాగోల్‌ నుంచి మెట్టుగూడ వరకూ 8 కి.మీ. పరుగులు పెట్టింది.నాగోల్ స్టేషన్ పరిసరప్రాంతాలు కూడా ఆహ్లదకరంగా ఏర్పాటు చేశారు. మెట్రో కారిడార్‌-1లో కీలకం మియాపూర్‌ మెట్రో స్టేషన్‌..పిల్లలు, పెద్దలు వారాంతాల్లో సరదాగా రోడ్లపై గడిపేందుకు రాహ్‌గిరి వేదికను నిర్మిస్తున్నారు. దీనికి అనుబంధంగా 5 ఎకరాల్లో పార్కింగ్‌ కాంప్లెక్సు, భవిష్యత్తులో మెట్రో మాల్స్‌ను  చేపడుతున్నారు…దేశంలోనే అతి పెద్ద మెట్రో స్టేషన్‌గా అమీర్ పేట్ కి ఇప్పటికే గుర్తింపు వచ్చింది.హైదరాబాద్ మెట్రోలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ కీలకమైనది. అమీర్‌పేట కేంద్రంగానే రెండు మార్గాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రెండు వేర్వేరు కారిడార్లను కలిపే ఈ స్టేషన్‌లో ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించొచ్చు. అందుకే, ప్రతి మెట్రో స్టేషన్‌ రెండంతస్తులు ఉంటే.. ఇది మాత్రం మూడంతస్తుల్లో ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top