పంజాబ్ లో 67 ఏళ్ల వృద్ధుడిని పెళ్లిచేసుకున్న 24 ఏళ్ల అమ్మాయి, ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులపైన కేసు..!

ఈ మధ్య మన దేశం లో జరిగే పెళ్ళిళ్ళల్లో పంజాబ్ లో జరిగే పెళ్లిళ్లే హైలైట్ అవుతున్నాయి, మొన్న పంజాబ్ కి చెందిన అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు అన్న వార్త సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలుసు. కానీ ఆస్ట్రేలియా వీసా, పౌరసత్వం కోసం మాత్రమే వివాహం చేసుకున్నట్టు తెలిపారు.

ఒక వృద్దుడిని 24 ఏళ్ళ వయసు గల అమ్మాయి పెళ్లి చేసుకోడం సోషల్ మీడియా లో హాట్ న్యూస్ అయ్యింది, పంజాబ్‌లోని ధురి సబ్‌డివిజన్‌‌లో ఉన్న బలైన్‌ గ్రామానికి చెందిన షంషేర్‌ సింగ్‌(67), నవ్‌ప్రీత్‌ కౌర్‌(24) ను గత నెలలో పెళ్లి చేసుకున్నాడు, ఇరు కుటుంబాలకు వీరు పెళ్లి చేసుకోడం ఇష్టం లేదు, అయినా కూడా వారు పెళ్లి చేసుకున్నారు, దీంతో కుటుంబసభ్యుల నుండి మాకు ప్రాణహాని ఉందని హై కోర్ట్ ని ఆశ్రయించారు.

రక్షా కరో.. :

వీరి కేసు ని పరిశీలించి, వీరికి రక్షణ కలిపించాలి అంటూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది, ఇరువురు మేజర్స్ కనుక వివాహం చేసుకోటం లో ఎటువంటి తప్పు లేదని కోర్ట్ తెలిపింది. ఈ జంటకు రక్షణ కల్పించాలని సంగ్‌రూర్, బర్నాలా జిల్లాల ఎస్ఎస్పీలను ఫిబ్రవరి 4న కోర్టు ఆదేశించింది, వీరి తరపున పంజాబ్-హర్యానా ఉమ్మడి హై కోర్ట్ లో వాదించిన న్యాయవాది మోహిత్ సదన మాట్లాడుతూ : ‘ఇదొక విరుద్ధమైన పెళ్లి, వీరి వివాహ బంధానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకుంది, అందుకే కోర్ట్ వీరికి రక్షణ కలిపించింది’ అని మోహిత్ తెలిపారు.

పెళ్ళికి, ప్రేమకు వయసుతో పనేంటి.. :

ప్రేమకు వయసుతో పనేంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు, దాదాపు 43 ఏళ్ళ చిన్న అమ్మాయిని ఎలా వివాహం చేసుకున్నావ్ అని కొందరు అంటుంటే, అందులో తప్పేంటి అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ పెళ్లి న్యూస్ వైరల్ కావడం తో సోషల్ మీడియా జనాల ఫోకస్ అంతా మరోసారి పంజాబ్ మీద పడింది, అయితే పంజాబ్ లోనే కాదు, మన దేశం లో చాలా చోట్ల ఇలా ముసలి వాళ్ళు యువకులను వివాహం చేసుకోడం ఇటీవల కాలం లో చూస్తున్నాం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, ఆడవారి మనసు ఎవరికి అర్ధం కాదులే అనే పదాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Comments

comments

Share this post

scroll to top