6 ఏళ్ల బిస్కెట్ కొందామని షాప్ కి వెళ్ళింది..! చాక్లెట్ ఆశ చూపించి ఆ షాప్ ఓనర్ ఏం చేసాడో తెలుసా?

జ‌మ్మూ కాశ్మీర్‌లో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫా బానోను కొంద‌రు దుర్మార్గులు అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన విష‌యం తెలిసిందే. అదే కాదు.. ఇటీవ‌లి కాలంలో మైనర్ బాలిక‌ల‌పై మ‌న దేశంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం పోక్సో చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసింది. ఇక‌పై 12 ఏళ్ల లోపు వారిని రేప్ చేస్తే నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధిస్తారు. అయితే నిజానికి ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసి క‌నీసం కొద్ది రోజులు కూడా కాలేదు.. ఇప్ప‌టికే దీని కింద ప‌లు ప్రాంతాల్లో నిందితుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా ఒడిశాలోనూ ఇదే చ‌ట్టం కింద ఓ నిందితుడిపై కేసు న‌మోదైంది. 6 సంవ‌త్స‌రాల బాలిక‌ను రేప్ చేసినందుకు గాను ఆ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేసి పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన 6 సంవ‌త్స‌రాల బాలిక బిస్కెట్ కొనుక్కుంటాన‌ని చెప్పి త‌న ఇంటికి స‌మీపంలో ఉన్న ఓ కిరాణా షాపుకు వెళ్లింది. అక్క‌డే ఆమెను చూసిన ఓ యువ‌కుడు (25) ఆ బాలిక‌కు రూ.5 పెట్టి చాక్లెట్ కొనిచ్చాడు. మ‌రిన్ని చాక్లెట్లు కొనిస్తా రమ్మ‌ని ఆశ చూపి ఆ బాలిక‌ను అత‌ను స‌మీపంలో ఉన్న ఓ స్కూల్‌కు తీసుకెళ్లాడు. అనంత‌రం అక్క‌డ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో అత‌ను ఆమెను గోడ‌కు విసిరికొట్టి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

అయితే ఆ వ్య‌క్తి ఆ బాలిక‌ను గోడ‌కు విసిరికొట్ట‌డంతో ఆ బాలిక అక్క‌డే సొమ్మ‌సిల్లి ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో చాలా సేపు అయ్యాక గానీ ఇంట్లో వారికి త‌మ కూతురు ఇంకా రాలేద‌ని అర్థం కాలేదు. దీంతో వారు చుట్టు ప‌క్క‌లంతా గాలించారు. చివ‌ర‌కు ఆ బాలిక తీవ్ర గాయాల‌తో స్కూల్‌లో సొమ్మ‌సిల్లి ప‌డిపోయి ఉండ‌డాన్ని ఆమె త‌ల్లి గుర్తించింది. అనంత‌రం వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు కేసు న‌మోదు చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆ బాలిక‌కు ఇంకా స్పృహ రాలేదు. ఆమె కోమాలోనే ఉంది. ఇక ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి నీచుల‌కు మ‌ర‌ణశిక్ష ఎందుకు వేయ‌కూడ‌దో. క‌చ్చితంగా ఇలాంటి వారికైతే స‌మాజంలో జీవించే అర్హ‌త లేనే లేదు..!

Comments

comments

Share this post

scroll to top