6 ఏళ్ల చిన్నారి “కేటీఆర్” కు ఏమని లెటర్ రాసిందో తెలుసా.? కేటీఆర్ స్పందించి ఏమన్నారంటే.?

 మంత్రి కెటిఆర్ ట్విటర్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.. అంతే యాక్టివ్ గా ఏదన్నా  సమస్య ఉందన్నా వెంటనే స్పందిస్తారు.అంతేకాదు తనలోని హాస్యప్రియున్ని కూడా ఒకసారి పరిచయం చేశారు ఈ మధ్య ఒక జోక్ ట్వీట్ చేసి అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు.మరోసారి ఇంకొకరు సాయం కోసం రెండు రాష్ట్రాల అధినేతలను కోరితే కెటిఆర్ వెంటనే స్పందించారు..ఇలా ఒకటి రెండే కాదు బోలెడు ఉదాహరణలున్నాయి కెటిఆర్ ట్విటర్ లో ట్వీట్స్ కి సంభందించి..అయితే న్యూ ఇయర్ కి డిజె పెట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వండి సర్ అంటూ సాయికుమార్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే దానికి కెటిఆర్ భలే చాతుర్యంతో స్పందించారు..ఇప్పుడు ఆరేళ్ల పాప కెటిఆర్ ని సాయం కోరుతూ ఉత్తరం రాసింది…ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం రాసిందో తెలుసా..
 
మానవత్వం మరిచిన ఘటనలు సమాజంలో కోకొల్లలు,తోటి మనిషికి సాయం చేయాలనే ఆలోచన మరిచిన మనుషులెందరో..కానీ ఆరేళ్ల ప్రాయంలో తన తోటి పిల్లలతో ఆడుకుంటూ ,అమ్మానాన్న దగ్గర మారాం చేస్తూ పెరగాల్సిన చిన్నారి ఎదుటి వారికి సాయం చేయడం గురించి ఆలోచించడం నిజంగా హర్షించదగిన విషయం.అల్వాల్ కి చెందిన సుప్రియకు వయసు ఆరేళ్లు..ఒకటో తరగతి చదువుతుంది..సుచిత్ర జంక్షన్లో బిక్షం అడుగుతున్న పిల్లలకు ఏదన్నా సాయం చేయాలని కోరుతూ మంత్రి కెటిఆర్ కూ స్వయంగా తన చేతిరాతతో ఉత్తరం రాసింది.. ఇప్పుడు ఈ ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆరేళ్ల వయసుకే తోటి వారికి సాయం చేయాలన్న ఆ అమ్మాయి ఆలోచనకు నెటిజన్లు అంతా సలాం చేస్తున్నారు..కేవలం మంత్రిగారిని సాయం అడగడమే కాదు..తను దాచుకున్న డబ్బులు రెండు వేలు వారికి ఇచ్చేస్తానని ఆ ఉత్తరంలో పేర్కొంది.ఇప్పటివరకు సాయం అడిగిన వారికి,సమస్య ఉందని తన దృష్టికి వచ్చిన వాటిని కెటిఆర్ నెరవేర్చారు.ఇప్పుడు ఈ కోరికపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరోసారి అది రుజువు చేసారు.

Comments

comments

Share this post

scroll to top