ఈ రోజే “రథసప్తమి”…! నేడు ఈ 6 పనులు తప్పక చేయాలి..ఎందుకో తెలుసా..?

హిందువులు మాఘశుద్ద సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. మాఘశుద్ద సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా కూడా పేర్కొంటారు.అంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.అంతేకాదు దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.కాబట్టి రథసప్తమినాడు ఏ పనులు చేయాలో తెలుసుకోండి…

  • రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలి.
  • పురుషులు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

                || జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే ||

“సప్తాశ్యముల గల ఓ సప్తమీ! నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రం అర్థం.

  • రథ సప్తమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయడం శ్రేయస్కరం.
  • రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి పిడకలు అంటించి, పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తే మంచిది.
  • తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పించాలి.
  • రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.

Comments

comments

Share this post

scroll to top