6 నెలల పసికందును భవనం పై నుంచి కిందకు విసిరాడు ఆ తండ్రి.! ఎందుకో తెలుసా.? అసలు కారణం అదే.!

సమాజంలో ఏదైనా వర్గానికో లేదంటే వ్యక్తిగతంగానో ఎవరికైనా సమస్య ఎదురైనప్పుడు కొందరు దానికి వ్యతిరేకంగా నిరసన చేస్తారు. ఇక ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా కొందరికి నచ్చవు. దీంతో వాటి పట్ల కూడా ప్రజలు ఆందోళన చేయడం సహజమే. అయితే ఆ ఆందోళనలు మాత్రం ఎక్కడైనా సహజంగానే జరుగుతుంటాయి. వాటిల్లో పెద్ద విశేషం ఏమీ ఉండదు. కానీ ఆ ప్రాంతంలో జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో ఓ తండ్రి ఏకంగా తన 6 నెలల పసికందును భవనం పై నుంచి కిందకు విసిరేశాడు. కానీ అదే సమయంలో కింద ఉన్న పోలీసులు ఆ పసికందును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆ పసికందు సురక్షితంగా బయట పడింది. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ఎలిజబెత్ సమీపంలోని క్వాడ్‌వేసి పట్టణంలోని జాయ్‌స్లోవో టౌన్‌షిప్‌లో అక్రమంగా నిర్మించిన 90 ఇళ్ళను కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇళ్ళను కూల్చివేతను స్థానికులు అడ్డుకొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై టైర్లు వేసి దగ్దం చేశారు. రోడ్లను బ్లాక్ చేశారు. పోలీసులపై రాళ్ళు రువ్వారు. తమ ఇళ్ళను కూల్చివేయవద్దని పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ నిరసనకారుడు తన 6 నెలల పసికందును తీసుకుని ఓ భవనం పైకి ఎక్కాడు.

అలా ఆ వ్యక్తి భవనం పైకి ఎక్కి తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే పసికందును కిందకు విసురుతానని బెదిరించాడు. అయితే కొందరు పోలీసులు ఆ వ్యక్తితో మాట్లాడేందుకు యత్నించారు. కానీ విఫలమయ్యారు. అలా ఎంత సేపు పట్టించుకోకుండా ఉండే సరికి ఆ వ్యక్తి తన బిడ్డను కిందకు విసిరేశాడు. అయితే అదే సమయంలో కింద ఉన్న పోలీసులు ఆ పసికందును రక్షించారు. దీంతో ఆ పసికందు ప్రమాదం నుంచి బయట పడింది. ఈ క్రమంలో పోలీసులు హత్యాయత్నం కింద ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఏది ఏమైనా ఎవరైనా సమస్య పరిష్కారం అవ్వాలంటే నిరసన చేయవచ్చు, కానీ మరీ ఇలా చేయకూడదు కదా..!

Comments

comments

Share this post

scroll to top