సంపాదించింది మొత్తం అమర సైనిక కుటుంబాలకు ఇచ్చిన యాచకురాలు….

రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు, ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు ఎవరైనా యాచకులు అయ్యా, అమ్మ ధర్మం చేయమ్మా అంటూ బిచ్చం అడుగుతుంటారు. పో అమ్మ , పో అయ్యా ఏమైనా పని చేసుకొని బతకొచ్చుకదా అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కొందరు. ఎంతటి ఉన్నోడైనా జేబులో నుంచి పైసా తీసి ఇవ్వాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ ఓ యాచకురాలు తను బిక్షమెత్తుకొని సంపాదించిన 6 లక్షల రూపాయలు దానం చేసింది. దానం చేసింది ఎవరికో కాదు, పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికులకు ఈ మొత్తాన్ని అందించింది. రాజస్థాన్ లో అజ్మీర్ వాసి నందిని శర్మ బజారంగడ్ లోని అంబెమాత మందిర్ దగ్గర గుడి ముందు బిక్షమెత్తుకునేది.

 

బిక్షమెత్తుతూ సంపాదించిన చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టకుండా బ్యాంక్ లో జమ చేసింది. తను ఎప్పుడు చనిపోతానో తెలియదని తనకు ఎవ్వరు లేరని ఆలోచించిన నందిని ఆలయంలో తెలిసిన ఇద్దరిని నామినీ పెట్టింది. గతేడాది అనారోగ్యం కారణంగా ప్రాణాలు విడిచింది నందిని శర్మ. అయితే ఆ డబ్బుని నామినీ అయిన ఆ ఇద్దరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నారు.

తన మరణం తరువాత ఆ డబ్బును తీసుకునేందుకు వీలుగా ఇద్దరు వ్యక్తుల పేర్లను నామినిగా పేర్కొంది. ఆమె మృతిచెందాక ఆ డబ్బుని ఎవరికైనా విరాళంగా ఇవ్వాలని వారిద్దరు ఎదురుచూస్తున్నారు. ఆ డబ్బును పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తే ఆమెకు ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని భావించారు వాళ్ళు. వెళ్లి కలెక్టర్‌కు ఆ సొమ్మును అందించారు.

కలెక్టర్‌ విశ్వ మోహన్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘వారిద్దరు జిల్లా పరిపాలనా విభాగ కార్యాలయానికి వచ్చి పుల్వామా దాడిలో మృతి చెందిన వీర జవాన్ల కుటుంబాలకు ఆ డబ్బు ఇవ్వాలని కోరారు. ఆశ్చర్యం అనిపించింది. ఇందుకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశాం. ఆ డబ్బు తీసుకుని ఇందుకు సంబంధించిన పత్రాన్ని వారికి అందించాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో డబ్బును అందించిన వారిద్దరిలో ఒకరైన సందీప్‌ గౌర్‌ మీడియాతో మాట్లాడారు. ఆమె అన్ని రోజులు యాచకురాలిగా సంపాదించిన డబ్బంతా దేశానికి ఉపయోగపడాలని భావించింది. అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందించడమే ఉత్తమంగా తాము భావించామని అన్నారు. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఆ అమ్మ కూడా అమరురాలే అని అంటున్నారు సోషల్ మీడియాలో.

అయితే తాజాగా పుల్వామాలో జరిగిన దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆ విరాళాన్ని అందచేయాలనుకున్నారు. ఆ డబ్బును కలెక్టర్ కి కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు. సహాయం చేయడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదని యాచకురాలైన నందిని శర్మ నిరూపించింది.

 

Comments

comments

Share this post

scroll to top