ఆ మ‌హిళ‌లు 578 మంది చెయిన్ లా గుండ్రంగా కూర్చుని గిన్నిస్ రికార్డు నెల‌కొల్పారు తెలుసా..?

గ్రామాల్లో ఉండే మ‌హిళ‌లు సాధార‌ణంగా ఎవ‌రైనా ఇద్ద‌రు ముగ్గురు క‌లిసి ఒక‌రి త‌ల‌కు ఒక‌రు నూనె రాసుకోవ‌డం, జ‌డ వేసుకోవ‌డం వంటివి చేస్తారు. దాదాపుగా ఏ గ్రామానికి వెళ్లినా మ‌న‌కు ఇదే క‌నిపిస్తుంది. అంతెందుకు మ‌న ఇండ్ల‌లో కూడా బామ్మ‌లు ఉంటే చిన్న పిల్ల‌ల‌కు త‌ల‌కు నూనె రాయ‌డం, జ‌డ వేయ‌డం చేస్తారు. అయితే ఇందులో త‌ల‌కు నూనె రాయ‌డం, జ‌డ వేయ‌డం అనే కాన్సెప్ట్ మాత్రమే కాదు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు కూడా మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. కానీ నేటి త‌రుణంలో ఇలా వేసుకునే వారు త‌క్కువ‌య్యారు. అయితే తాజాగా ముంబైలో జరిగిన అలాంటి ఓ ఘ‌ట‌న మ‌న‌కు మ‌ళ్లీ వెనుక‌టి రోజుల‌ను గుర్తుకు తెచ్చింది. అంతే కాదు, ఆ ఈవెంట్ ఏకంగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది.

బ‌జాజ్ ఆల్మండ్ డ్రాప్స్ అనే హెయిర్ ఆయిల్ ఉంది తెలుసు క‌దా. అదే కంపెనీ వారు ముంబైలో గ‌త నెల 26వ తేదీన ఓ ఈవెంట్ చేశారు. అదేమిటంటే… 578 మంది మ‌హిళ‌ల‌ను ఒక చెయిన్‌లో గుండ్రంగా కూర్చోబెట్టి వారికి ఆయిల్ ఇచ్చారు. అనంత‌రం వారిని ఒక‌రికొక‌రు త‌ల‌కు నూనెతో మ‌సాజ్ చేసుకోమ‌ని చెప్పారు. అలా వారు 3 నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకున్నారు. దీంతో త‌ల‌కు మ‌సాజ్ చేసుకున్న అత్యంత పొడ‌వైన మాన‌వ హారంగా వారు గిన్నిస్ రికార్డుకు ఎక్కారు. బ‌జాజ్ ఆల్మండ్ డ్రాప్స్ కంపెనీ ఆ ఘ‌న‌త సాధించింది.

కావాలంటే ఆ వీడియో క్లిప్పింగ్‌ను మీరు పైన చూడ‌వ‌చ్చు. చూశారుగా… నిజంగా వారు అలా చేస్తుంటే మ‌న‌కు వెనుక‌టి రోజులు గుర్తుకు వ‌స్తాయి. మ‌న బామ్మ‌లు, అమ్మ‌లు, పిన్ని, అక్క‌, చెల్లి.. ఇలా ఆడవారు ఖాళీ స‌మ‌యాల్లో ఒక‌రి త‌ల‌కు ఒక‌రు నూనె రాసుకుని జ‌డ వేసుకుంటారు. అదే గుర్తుకు వ‌స్తుంది. ఏది ఏమైనా మ‌ళ్లీ ఆ రోజుల‌ను గుర్తు చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే క‌దా. అందులోనూ వారు తాజా ఈవెంట్‌తో గిన్నిస్ రికార్డుకు కూడా ఎక్కారు మ‌రి..!

https://www.wittyfeed.com/story/60492/bajaj-almond-drops-set-a-guinness-world-record

Comments

comments

Share this post

scroll to top