ఆ హీరోయిన్ హెయిర్ స్టైల్ కోసం 55 లక్షలు ఖర్చు చేశారంట!

ప్రస్తుతం మన స్టార్ హీరోహీరోయిన్లు స్టైల్ విషయంలో కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. స్టైల్ కోసం ఎంత ఖర్చైనాసరే ఓకే అంటూ దూసుకుపోతున్నారు.  నో అనే మాట ఎవరినోట రావడం లేదు. తాజాగా బాలీవుడ్ అందాలతార కత్రినాకైఫ్ తన హెయిర్ స్టైల్ కోసం ఖర్చుచేసిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కత్రినా తాజాగా నటించిన చిత్రం ‘ఫితూర్’. అభిషేక్  కపూర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్, కత్రినాకైఫ్ జంటగా నటించారు. ఈ చిత్రంలో కత్రినాకైఫ్ జమిందారు కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తోంది. ముందు సినిమాలను చూస్తే కత్రినా హెయిర్ సిల్కీగా,బ్లాక్ గా ఉండేవి. అయితే ఈ సినిమాకోసం కత్రినా హెయిర్ స్టైల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారట చిత్ర యూనిట్.

katrina-fitoor-647_012816013911

కత్రినా హెయిర్ సిల్కీగా ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటాయి. ఇలా రావడానికి మొదట లోకల్ హెయిర్ స్టైలిస్ట్ లనే ఎంచుకున్నా, అనుకున్న విధంగా ఆ హెయిర్ స్టైల్ లేకపోవడంతో లండన్ లో ఉన్న ఎక్స్ పర్ట్స్ ను సంప్రదించగా అప్పటికి ఆ హెయిర్ స్టైల్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ జరిగినన్నీ రోజులే కత్రినా యూకే వెళ్లి హెయిర్ స్టైల్ చేయించుకొని షూటింగ్ లో పాల్గొనేదట. ఇలా మొత్తంగా 55 లక్షలు ఖర్చు హెయిర్ స్టైల్ కోసం అయినట్లు సమాచారం. సిద్దార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వాలెంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది.

Comments

comments

Share this post

scroll to top