500,1000 రూపాయల పాతనోట్లను ఎలా మార్చుకోవాలి? గ్రామస్తులు ఏం చేస్తే మంచిది??

నిన్న అర్థరాత్రి నుండి 500/-, 1000/- రూపాయల నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ లేని కారణంగా మధ్యతరగతి ప్రజలకు ఆందోళనకు గురవుతున్నారు. పాత నోట్లను ఏలా మార్చుకోవాలి? దాని కోసం ఏం చేయాలనే విషయాలు తెలియక హైరానా పడిపోతున్నారు.

 • పాత నోట్లను నవంబర్ 10 నుండి డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉంది.
 • బ్యాంక్ లు, పోస్ట్ ఆఫీస్ లో పాత 500/- 1000/- నోట్లు ఇచ్చి వాటి ప్లేస్ లో  100/- 50/-  నోట్లు తీసుకోవొచ్చు./ ఆథార్/ఓటర్ ఐడిలలో ఏదో ఒక గుర్తింపు కార్డ్ చూపించి  రోజుకు 4 వేల  రూపాయల వరకు తీసుకునే అవకాశంఉంది.(దీనికోసం బ్యాంక్ లో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు.)
 • ఒకేసారి 50 వేల కంటే ఎక్కువ డబ్బులు  బ్యాంక్ లో జమా చేయాలంటే బ్యాంక్ లో అకౌంట్ తప్పకుండా ఉండాలి, జమ చేసే ముందు  PAN కార్డ్ చూపించాల్సిన అవసరం ఉంటుంది.
 • ATM ల నుండి రోజుకు  గరిష్టంగా 10000 మాత్రమే డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అది కూడా వారానికి 20 వేలకు మించకుండా ఉంటుంది.
 • డిసెంబర్ 30 లోపు తమ దగ్గరున్న డబ్బులను బ్యాంక్ లలో కానీ,, పోస్ట్ ఆఫీస్ లలో కానీ జమా చేసుకోలేని వారు… మార్చి 31 వరకు  RBI కు వెళ్లి, డిక్లరేషన్ ఫామ్ సమర్పించి డబ్బులు జమా చేసుకోవొచ్చు.

రెండు రోజుల పాట పాత 500/-, 1000/- నోట్స్ చెల్లే ప్రాంతాలు:

 • హాస్పిటల్స్.
 • మెడికల్ షాప్స్.
 • పెట్రోల్ బంక్స్.
 • రైల్వే, బస్ టికెట్స్ కొనుగోలు.
 • గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రతి సంస్థలో.
 • చెక్కులు, DD లు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లపై ఎలాంటి ఆంక్షలు లేవు.

500/- 1000/-  పాతనోట్లను ఉపసంహరించడం వల్ల ఎవరికి లాాభం:

 • ఇండ్ల స్థలాలు, బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి.
 • బ్లాక్ మనీ ని అరికట్టవచ్చు.
 • అధికంగా సాగుతున్న డబ్బు ప్రవాహాన్ని అరికట్టవచ్చు.
 • పెద్ద మొత్తం ట్రాన్జక్షన్ జరిగే డబ్బు మీద నిఘా ఉంటుంది.

ఊర్లోని జనాలు ఏం చేస్తే మంచిది:

ఊర్లో జనాలు, బ్యాంక్ లావాదేవీలకు దూరంగా ఉంటారు, కాబట్టి ఈ నిర్ణయం వారిని చాలా ఇబ్బందికి గురిచేసేదే…అందుకు గాను గ్రామస్తులందరూ పోస్ట్ ఆఫీస్ లో 50/- రూపాయలు పెట్టి అకౌంట్ తీసుకుని, పోస్ట్ ఆఫీస్ లో వారి దగ్గరున్న పాత 500/- 1000/- రూపాయల నోట్లను  జమా చేసుకోవడం అత్యుత్తమ మార్గం.ఇప్పటికే చాలా మంది గ్రామస్తులకు ఉపాధిహామీ పథకం కింద పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పెద్ద నోట్ల మార్పిడి గ్రామస్తులు సులువుగా చేసుకోవొచ్చు.

 

Comments

comments

Share this post

scroll to top