ఓడించానని సంబరపడిన విధిపై గెలిచిన ధీశాలి.!

ముందుగా ఇతడి ధైర్యానికి మనమంతా తలొంచి సలాం చేయాలి. అయిదేళ్ళ వయస్సులో రెండు కాళ్లూ చేతులు కోల్పోయినా ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఎన్నో కష్టాలకోర్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు.  కుటుంబానికి భారం అనుకున్న అతడే ఇప్పుడా కుటుంబానికి ఆసరా అయ్యాడు. ప్రతాప్ జీవితాన్ని గురించి వింటే..నిజంగా అతడి స్థైర్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

సరదాగా స్నేహితులతో చేసిన ఛాలెంజ్ ..అతడిని అవిటి వాడిని చేసింది:

ఐరన్ రాడ్ ను వంచాలి…అని స్నేహితులు బెట్ వేశారు. ప్రతాప్ ఓకే అని దానికి వంచే ప్రయత్నం చేశాడు, షాట్ సర్య్కూట్ అయ్యి….రెండు చేతులు, రెండు కాళ్లు పూర్తిగా కాలిపోయాయి. హాస్పిటల్ కు తీసుకెళ్తే వాటిని తొలగించారు. అప్పటి నుండి ఇంటి దగ్గరే ఉండేవాడు.

చెల్లెళ్ల పుస్తకాలను చదువుతూ…..

ప్రతాప్ కు ముగ్గురు చెల్లెళ్లు….ప్రతిరోజూ ఇంటి దగ్గరే ఉండే ప్రతాప్ ….చెల్లెళ్ల బుక్స్ చదివేవాడు. పుస్తకంలో ఉన్న ప్రతిదీ స్వయంగా అవగాహన చేసుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇలాగే చదివాడు.

502ebf9a-9cd7-4765-a351-456a304a56f6

మొకాళ్ల పై నడక, మోచేతులతో టైపింగ్:

రెండు చేతులు, కాళ్లు పూర్తిగా కోల్పోవడంతో….ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇలా కాదని స్వయంగా మొకాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశాడు, విపరీతమైన నొప్పులను భరిస్తూ మెల్లి మెల్లిగా అలా నడవడం అలవాటు చేసుకున్నాడు ప్రతాప్.

వేళ్లు సరిగ్గా ఉంటేనే కంప్యూటర్ కీ బోర్డ్ మీద టైపింగ్ చేయడం కష్టం, అలాంటిది ప్రతాప్ మోచేతితో కీ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తాడు..దీని వెనుక  అతని కఠోర శ్రమ దాగుంది.

చదువు:

కాళ్లు సహకరించకపోవడంతో….చదువంతా ఇంటి వద్ద నుండే సాగింది. ఇంటర్ పాస్ అయ్యాక, B.com చేశాడు , I-CET లో ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో MBA లో జాయిన్ అయ్యాడు, అప్పటి వరకు బయటకు వెళ్ళని ప్రతాప్..తనకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన శాండిల్స్ సహాయంతో బయటకు వెళ్లడం మొదలు పెట్టాడు. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం ఉస్మానియాలోనే నేర్చుకున్నాడు.

ఇంటర్వ్యూలు: 

MBA తర్వాత ప్రతాప్ చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు , కానీ చాలా ఇంటర్వ్యూ బోర్డ్ లు ప్రతాప్ ను ఉద్యోగంలో చేర్చుకోడానికి ఇష్టపడలేదు. ఇతను సరిగ్గా ఉద్యోగం చేస్తాడా? అని తమలోనే తటపటాయించి ఇతనిని తీసుకోలేదు. చివరకు ఇతడి ప్రతిభను, ఇతని ధైర్యాన్ని మెచ్చి ONGC సంస్థ స్టాస్టికల్ ఆపీసర్ పోస్ట్ ను ఇచ్చింది.

తల్లీదండ్రులు:

కుటుంబానికి భారం అనుకున్న వాడే…ఇప్పుడు కుటుంబానికి అండగా నిలబడడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top