కొత్త సంవత్సరం లో చాలా మంది తీసుకునే అతి ముఖ్యమైన 5 నిర్ణయాలు ఇవే :

కొత్త సంవత్సరం లో మనం ఏవేవో చెయ్యాలని అనుకుంటాం. కొత్త సంవత్సరం లో చెడు అలవాట్లు మానుకోవాలి,

డబ్బు ఆదా చేసుకోవాలి… ఇలా ఏవేవో అనుకుంటూ ఉంటారు మనోళ్లు. ఇలా అందరూ అనుకొనే ఒక 5 నిర్ణయాలు :

1.) మద్యపానం ధూమపానం కి దూరంగా ఉండాలి :

చాలా మంది కొత్త సంవత్సరం రాగానే, మద్యపానం ధూమపానం ని వదిలెయ్యాలి అని అనుకుంటారు. అందుకే డిసెంబర్ 31 వ తారీఖున ఎగబడి తాగి, మరుసటి రోజు అనగా జనవరి 1st నుండి మానెయ్యాలి అనుకుంటారు. కానీ ……. ఆ తరువాత జరిగేది మీ అందరికి తెలుసు.

2.) డబ్బు ఆదా చేసుకోవాలి అబ్బా :

డబ్బు డబ్బు డబ్బు… డబ్బులు బాగా ఖర్చు పెట్టే వారు అనుకొనేది, కొత్త సంవత్సరం నుండి డబ్బు బాగా ఆదా చేసుకోవాలి అని అనుకుంటారు.

3.) డ్రీం గర్ల్ / క్రష్ :

అబ్బాయిలు అయితే ఎక్కువ శాతం కొత్త సంవత్సరం లో వారు ప్రేమిస్తున్న అమ్మాయికి ప్రొపోజ్ చెయ్యాలి అనుకుంటారు, కొంత మంది ధైర్యం చేసి ఫిబ్రవరి 14 వ తారీఖున ప్రొపోజ్ చేస్తారు అనుకోండి. మరి కొంత మంది ప్రొపోజ్ చెయ్యకుండా మళ్ళీ చేద్దాం లే అని వదిలేస్తారు.

4.) ఫ్యామిలీ తో టైం… :

చాలా మంది తమ కుటుంబం కోసం సరైన సమయాన్ని కేటాయించలేకపోతారు, అందుకే కొత్త సంవత్సరం లో అమ్మా నాన్న బంధువులతో కలిసి ప్రదేశాలు తిరగాలి అని అనుకుంటారు.

5.) చివరిదే కానీ ముఖ్యమైనది:

కొత్త సంవత్సరం లో ఉద్యోగం లేని వాళ్ళు ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకుంటారు. ఉద్యోగం లో ఉన్న వాళ్ళు ఇంకా మంచి పోసిషన్ కి వెళ్లాలనుకుంటారు. డబ్బులు బాగా సంపాదించి నలుగురిలో బాగా బ్రతకాలని కోరుకుంటారు. అది వ్యాపారం చేసే వాళ్ళు అయినా, ఉద్యోగం చేసే వాళ్ళు అయినా.

అత్యధిక శాతం మంది అనుకొనేవి మాత్రమే ఇందులో ప్రస్తావించడం జరిగింది. చాలా మంది చాలా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు, కొత్త సంవత్సరం లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారో కామెంట్స్ లో తెలుపండి.

 

 

Comments

comments

Share this post

scroll to top