ఈ 5 ప్రదేశాలు నిజంగా అద్భుతాలే..! వాటివెనకున్న మిస్టరీని ఇప్పటికి సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు..!

ఈ విశ్వ‌మంతా ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. సృష్టి జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌రకు మాన‌వులు ఎన్నో విష‌యాల‌ను క‌నుగొన్నారు. తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే సైంటిస్టులు కూడా రోజుకో కొత్త విష‌యాన్ని మ‌న‌కు చెబుతున్నారు. అయితే ఎన్ని విష‌యాలు చెప్పినా, ఇంకా సైంటిస్టుల‌కు అంతు చిక్క‌ని ఎన్నో ర‌హ‌స్యాలు సృష్టిలో దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ ప్ర‌దేశాల్లో అలా వింత‌గా ఎందుకు జ‌రుగుతుందో సైంటిస్టులు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేక‌పోయారు. మరి వాటిపై ఓ లుక్కేద్దామా..!

1. బ్ల‌డ్ ఫాల్స్‌, అంటార్కిటికా
ఈ ప్ర‌దేశం భూమిపై ఉన్న అత్యంత చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో మొద‌టి స్థానంలో ఉంటుంది. ఇక్క‌డ ఉష్ణోగ్ర‌త‌లు -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వ‌ర‌కు ఉంటాయి. ఆ స్థితిలో నీరంతా గ‌డ్డ‌క‌ట్టుకుని ఉంటుంది. కానీ దానిపై ఆశ్చ‌ర్యంగా ఎరుపు రంగులో ఓ ద్ర‌వం ప్ర‌వ‌హిస్తూ ఉంటుంది. అది ఎరుపు రంగులో ఉందుకు ఉందో, అలా ఎందుకు ప్ర‌వ‌హిస్తుందో సైంటిస్టులు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుసుకోలేక‌పోయారు.

2. గ్రావిటీ హిల్స్‌, ల‌దాక్‌, ఇండియా
ల‌దాక్‌లోని లెహ్ అనే ప్రాంతం వ‌ద్ద గ్రావిటీ హిల్స్ ఉన్నాయి. అక్క‌డ ఏదైనా వాహ‌నాన్ని కొండ కింద దిగువ‌న సూచించిన మార్క్‌లో పార్క్ చేస్తే ఆ వాహ‌నం ఆశ్చ‌ర్యంగా ఎవ‌రూ న‌డ‌పాల్సిన‌, లాగాల్సిన ప‌నిలేకుండా దానంత‌ట అదే కొంద పైకి వెళ్తుంది. ఇది నిజంగా మిస్ట‌రీనే.

3. Castle Frangokastello, Greece
ఈ కోట‌లో ప్ర‌తి ఏటా మే నెల చివ‌రి వారంలో ఓ అద్భుతం జ‌రుగుతుంది. ఈ కోట‌లోని ప‌లు బొమ్మ‌ల నీడ‌లు ఒక ప్ర‌దేశం నుంచి మ‌రొక ప్ర‌దేశానికి అచ్చం మ‌నుషులు వెళ్లిన‌ట్టే వెళ్తాయి. చాలా ఆశ్చ‌ర్యంగా దీన్ని స్థానికులు చూస్తారు. గ‌తంలో ఒక‌ప్పుడు జ‌ర్మ‌న్ సైనికులు ఇది వింత అని తెలియక ఆ బొమ్మల నీడ‌ల‌ను మ‌నుషుల‌ను అనుకుని వాటిపై తుపాకుల‌తో కాల్పులు జ‌రిపార‌ట‌.

4. Eternal Flame Falls, USA
ఇక్కడ పారే వాట‌ర్ ఫాల్స్ వెనుక భాగంలో రాళ్ల‌పై ఆటోమేటిక్ గా మంట‌లు వ‌స్తుంటాయి. అయితే ఇందుకు కార‌ణం గ్యాస్ అని సైంటిస్టులు అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ గ్యాస్ మంటలు అలా నీటిలో ఎందుకు మండుతాయి ? అనే విష‌యాన్ని వారు తేల్చ‌లేక‌పోతున్నారు. అయితే ఆ మంట‌లు ఆటోమేటిక్ వ‌స్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఎవ‌రూ మండించ‌రు.

5. The River of Five Colors, Colombia
ఈ న‌దిలో ఎండాకాలం వ‌చ్చిందంటే అనేక రంగులు నీటిలో ద‌ర్శ‌న‌మిస్తాయి. దీనికి కార‌ణాలు మాత్రం తెలియ‌దు. కానీ కొంద‌రు స్థానికులు మాత్రం ఏమంటారంటే… ఇక్క‌డ కొన్ని వంద‌ల ఏళ్ల కింద‌ట ఓ రాజు న‌ది కింద నీటిలో నిధిని పెట్టాడ‌ని, అందుకే అలా రంగులు రంగులుగా నీరు క‌నిపిస్తుంద‌ని అంటారు. గ్రీన్‌, పింక్‌, బ్లూ, ఎల్లో, రెడ్ క‌లర్స్‌లో ఈ న‌ది నీరు క‌నిపిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top