400 ఏళ్ల నిరీక్షణ.. తల్లికాబోతున్న మైసూర్ మహారాణి! ఇప్పుడున్న రాజు ఎవరు మరి?.. ఇదే శాపం!

400 ఏళ్ల నిరీక్షణ ఫలించడం ఏంటి..? మైసూర్ మహారాణి తల్లి అవ్వడం ఏంటి..? ఇప్పటి వరకు రాజులు ఎలా ఉన్నారు అనుకుంటున్నారా..? దీనికో పెద్ద స్టోరీ నే ఉందండి. ఏళ్లుగా ఆ రాజవంశం చేస్తున్న పూజలు, వ్రతాలు, హోమాలకు ఫలితం దక్కింది. ఇంట్లో పసిపిల్లల అల్లరి చూడనున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. వివరాలు చూడండి!

2016 జూన్ లో మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ కు త్రిశిక కుమారితో వివాహం అయ్యింది. ఈ దంపతులు ఇప్పుడు తల్లితండ్రులు కానున్నారు. ఈ వార్తే మైసూర్ రాజవంశంలో సంతోషాలకు అవధులు లేకుండా చేస్తోంది. సంతానం కలుగుతుంది అంటే సాధారణంగా సంబరపడతారు. అదే 400 ఏళ్ల తర్వాత అంటే ఇంక సంతోషానికి అవధులు ఉంటాయా..? కానీ పిల్లలు లేకపోవడం ఏంటి?

రాజులు మారుతున్నా.. తరతరాలుగా ఆ వంశంలో ఏ రాజుకీ పిల్లలు లేరు. దత్తత తీసుకోవడమే తప్ప… కన్నబిడ్డలు లేరు ఎవరికీ. ఇలా 400 ఏళ్లుగా సాగుతోంది. ప్రస్తుత రాజు యదువీర్ కూడా దత్త పుత్రుడే. దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయర్‌– రాణి ప్రమోదాదేవి.. యదువీర్‌ను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం త్రిషిక ఐదు నెలల గర్భిణి. దీంతో రాజమాత ప్రమోదాదేవి, రాజ కుటుంబం ఆనందంలో వెల్లివిరుస్తోంది.

పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటి అంటే…శ్రీరంగపట్టణం మహారాణి అలమేలమ్మ శాపము అని పూర్వికులు అంటున్నారు. అలమేలమ్మ భర్త తిరుమల రాజ మైసూరు సింహాసనం ఏలుతుండగా, రాజ ఒడెయర్‌ ఆయనపై తిరుగుబాటు చేసి రాజవుతాడు. దీంతో ఆవేదనకు గురైన అలమేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలను తీసుకుని తలకాడుకు వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఒడెయర్‌ సైనికులు ఆమెను చుట్టుముడతారు. ఆ సమయంలో అలమేలమ్మ తీవ్ర ఆగ్రహంతో… మైసూరు రాజులకు ఎప్పటికీ కడుపు పండదని శపించి కావేరి నదిలో దూకి మరణిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top