పోటెత్తిన ఓట‌ర్లు..ఓట్లేసిన ప్ర‌ముఖులు – త‌ల్లికి మొక్కిన మోదీ

దేశంలో ఎన్నిక‌ల వాతావార‌ణం మ‌రింత వేడిని రాజేస్తోంది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టికే రెండు విడత‌ల పోలింగ్ పూర్తి కాగా..ప్ర‌స్తుతం మూడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాలు..రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో 1640 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వాస్త‌వానికి మూడో ద‌శ‌లో భాగంగా 115 సీట్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. త్రిపుర‌లోని త్రిపుర‌..తూర్పు లోక్‌స‌భ స్థానం ఎన్నిక రెండో ద‌శ నుండి మూడో ద‌శ‌కు వాయిదా ప‌డింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 116కు చేరింది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, స‌మాజ్‌వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు జ‌య‌ప్ర‌ద‌, మేన‌కాగాంధీ కొడుకు వ‌రుణ్ గాంధీ, సుప్రియా సూలే, శ‌శిథ‌రూర్, జ‌న‌తాద‌ళ్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, త‌దిత‌ర దిగ్గ‌జాలు మూడో ద‌శ‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు కోనున్నారు.

మ‌రో వైపు ఒడిషా లోని 42 శాస‌న‌స‌భ స్థానాల‌కు కూడా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌తో పాటే పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అహ్మ‌దాబాద్‌లో భారీ ఎత్తున జ‌నం ఆహ్వానం ప‌ల‌క‌గా ..అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ల మ‌ధ్య భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ త‌న విలువైన ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ర‌నిప్ లోని నిశ‌న్ హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్ ఆవ‌ర‌ణ‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్క‌డికి వ‌చ్చి అంద‌రితో పాటుగా మోదీ ఓటు వేశారు. అంత‌కు ముందు గాంధీ న‌గ‌ర్‌లో త‌న త‌ల్లి ఉంటున్న నివాసానికి చేరుకున్నారు. ఆమెను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. కొడుకు మోదీకి ప్రేమ‌గా అమ్మ స్వీటు తినిపించారు. ఆ త‌ర్వాత ఆమెకు పాదాభివంద‌నం చేశారు మోదీ. ఆయ‌న వెంట భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ షా కూడా ఉన్నారు.

ఓటు వేశాక‌..మోదీ మీడియాతో ముచ్చ‌టించారు. స్వంత రాష్ట్రం గుజ‌రాత్‌లో తాను ప్ర‌ధాని హోదాలో ఓటు వేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మోదీ. ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కు వినియోగించు కోవాల‌ని పిలుపునిచ్చారు. మూడో విడ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ..ప్ర‌తి ఒక్క‌రు ఓటు వేసేందుకు త‌ర‌లి రావాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా మోదీ సందేశ‌మిచ్చారు. మీ ఓటు చాలా విలువైన‌ది..దేశ భ‌విష్య‌త్ కోసం ఓటు వేయండంటూ కోరారు. మూడో ద‌శ‌లో భాగంగా గుజ‌రాత్‌లోని 26 లోక్ స‌భ స్థానాల‌కు ఇవాళే ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. కేర‌ళ సీఎం విజ‌య‌న్ ..ఓట‌ర్ల వెనుక క్యూలో నిల‌బ‌డి ఓటు వేశారు. ప్ర‌ముఖులు, క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌లు..ఓటు వేసేందుకు క్యూ క‌ట్టారు. మొత్తం మీద ఈసారి జ‌రుగుతున్న ఎన్నిక‌లు మ‌రింత టెన్ష‌న్‌ను క‌లిగిస్తున్నాయి.

Comments

comments

Share this post

scroll to top