వాట్ యాన్ ఐడియా మేడమ్స్ జీ.! ఇలా ఉండాలి ఆలోచన-ఆవిష్కరణ.

నేటి ఉరుకుల, పరుగుల బిజీ ప్రపంచంలో నగరాలే కాదు, ఓ మోస్తరు పట్టణాల్లోను రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా రోజు రోజుకీ వేల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్ల పైకి వస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు వంటి మెట్రో నగరాల్లో రద్దీగా ఉన్న రోడ్డును దాటాలంటే సగటు పాదచారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నప్పటికీ అవి ఆ ప్రాంతాలకే పరిమితం మిగతా చోట్ల రోడ్డు దాటేందుకు పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గుజరాత్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఈ సమస్యకు కొత్త పరిష్కారం చెప్పారు. కేవలం రద్దీగా ఉన్న రోడ్లే కాదు, హైవేలపై కూడా వారు చెప్పిన పద్ధతిని పాటిస్తే పాదచారులు ఎంతో సులభంగా రోడ్డును దాటవచ్చు.
12804790_880071055455948_757368490162610401_n
గుజరాత్‌లోని ఇద్దరు మహిళలు అక్కడి ఓ పట్టణంలో రద్దీగా ఉండే రహదారిపై 3డీ జీబ్రా క్రాసింగ్ లైన్లను పెయింట్ వేశారు. ఇది చూడ్డానికి అచ్చం ఎలా కనిపిస్తుందంటే నిజంగా రోడ్డుపై ఏదైనా ఉందేమోనన్న భావనను వాహనదారులకు కలిగిస్తుంది. దీంతో వారు ఆ క్రాసింగ్ దగ్గరకు రాగానే ఆటోమేటిక్‌గా స్లో అవుతారు. అప్పుడు దాన్ని జీబ్రా క్రాసింగ్‌గా గుర్తించి, ఎవరైనా రోడ్డు దాటుతుంటే ఆగుతారు. నిజంగా ఆ ఇద్దరు మహిళలు చూపిన ఈ పరిష్కారం దేశంలోని రద్దీగా ఉండే ఎన్నో రహదారుల్లో అమలు చేయదగినది. వారి ఆలోచనకు హ్యాట్సాఫ్. అయితే వారికి ఈ ఆలోచన ఎలా కలిగిందంటారా? అది ఇలా. వారు నివసించే పట్టణంలో స్థానికంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో చిన్నారులు రోడ్డును దాటుతుంటారు. ఈ నేపథ్యంలోనే రద్దీతో కూడిన రోడ్డును దాటడం వారికి కష్టతరమైంది. వారు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన సదరు మహిళలు ఈ ఉపాయం చేశారు. అలా అది ఇప్పుడు అందరిచేత ప్రశంసలను పొందుతోంది. మన దగ్గర కూడా ఇలా చేస్తే ఎంతో బాగుంటుంది కదూ. అప్పుడు రోడ్డు దాటడం చాలా ఈజీ కదా!

Comments

comments

Share this post

scroll to top