30 యేళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే…..ఎదుర్కోవాల్సిన 6 ప్రధాన సమస్యలు.!

జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి…ఈ మద్యకాలంలో చాలామంది యువతీ యువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇష్టంలేకపోవడం , వివాహం తర్వాత అనుకోకుండా ఎటువంటి ఆపద వచ్చినా…ఆర్థికంగా తట్టుకొని నిలబడడం కోసం చాలా మంది యువకులు..లైఫ్ లో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో చాలామంది 30-35 యేళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు. జీవితంలో స్థిర పడ్డాకే పెళ్లి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ….35 దాటాక పెళ్లి అంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులేంటో ఓ సారి చూద్దాం.

డబ్బుకు అధిక ప్రియారిటీ ఇవ్వడం:
30 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ జీవితం మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. డబ్బు యొక్క ప్రాముఖ్యత తెలిసివస్తుంది. ఈ సమయంలో పెళ్లి అయితే….సదరు యువతీ/యువకులు ప్రధాన లక్ష్యం వీలైనంత డబ్బు సంపాదించాలనే ఉంటుంది. ఈ క్రమంలో తమ వైవాహిక జీవితం మీద అంతగా శ్రద్ద పెట్టరు. ఒకరి ఇష్టాఇష్టాలను అంతగా పట్టించుకోరు. దీంతో వైవాహిక జీవితం సాఫీగా సాగదు.

jblb5wjom940piwrcb2b

ఉత్సుకత తగ్గిపోవడం:
25-30 పెళ్లికి సరైన వయస్సు…..30 దాటాక…స్త్రీ/పురుషుల సాంగత్యం కోసం వెంపర్లాడే ఉత్సుకత తగ్గిపోతోంది. ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ తగ్గినా వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదు.

download

జీవిత భాగస్వామికి ఎక్కువ టైమ్ ఇవ్వలేకపోవడం:
ఈ వయస్సుకు వచ్చే సరికి ఉద్యోగ పరంగా సీనియారిటీ రావడం, కొన్ని అధనపు బాధ్యతలను మోయాల్సి రావడంతో….జీవిత భాగస్వామికి తగిన సమయాన్ని కేటాయించలేరు. ఇది….. ఇల్లీగర్ ఎఫైర్స్ కు కూడా కారణం కావొచ్చు.

Close-up of male’s hand with pen over document on background of working woman

సమాజపు ఒత్తిడులు:
మీకు పెళ్లి అయ్యే సమయానికి, మీ ఫ్రెండ్స్ కి..స్కూల్ కి వెళ్లే పిల్లలుండడం…ఇది కాస్తంత గిల్టీ ఫీలింగ్ కు కలిగించే అంశం… ఈ విషయంలో బంధువుల నుండి చుట్టుపక్కల నుండి ఒత్తిడులు అధికం అవుతాయి.

శృంగార పటుత్వం తగ్గిపోవడం:
స్త్రీ, పురుషుల లైంగిక అవయవాల పనితీరు 25-30 సంవత్సరాల మధ్య ఉన్నత స్థితిలో ఉంటుంది. పురుషులలో అయితే 30 తర్వాత శుక్రకణాలు సంఖ్య క్రమంగా తగ్గుతుంటుంది. ప్రస్తుత కాలంలో కాలుష్యం, పోషకాలు లేని ఆహారం, పని ఒత్తిడుల కారణంగా..మగాళ్లలో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 25-30 వయస్సులో ఒక ML వీర్యంలో 130 మిలియన్స్ ఉండాల్సిన శుక్రకణాలు ఇప్పుడు 105 మిలియన్స్ కు పడిపోయాయని WHO నే చెప్పింది.

Spermatozoons, floating to ovule - 3d render

జీవితపు మాధుర్యాన్ని కోల్పోవడం:

30-35 వరకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు….ఉద్యోగం దొరకడం, టైమ్ టు టైమ్ జాబ్ చేయడం, తర్వాత పెళ్లి,  ఆ వెంటనే పెళ్లి…..పిల్లలు,వారి చదువులు, వారి లైఫ్ ప్లానింగ్. ఈ మొత్తం క్రమంలో….జీవితపు మాధుర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చేసుకున్న వారితో కూడా సంతోషంగా గడపలేని పరిస్థితి నెలకొంటుంది.

back-to-school

Note: ఇలాంటి విలువైన సమాచారం డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే……… మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top