వాట్సాప్‌లో రానున్న 3 అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఇవే..! ఇకపై షేక్ చేస్తే చాలు…అందరికి మెసేజ్..!

వాట్సాప్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకీ పెరుగుతున్న వాట్సాప్ వినియోగ‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉంది. ఇప్ప‌టికే ఇందులో బోలెడ‌న్ని కొత్త ఫీచ‌ర్లు ఈ మ‌ధ్య కాలంలో యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే అక్క‌డితో ఆగ‌కుండా త్వ‌ర‌లో వాట్సాప్ మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తేనుంది. మ‌రి ఆ ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేద్దామా..!

ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌…
వాట్సాప్ లో ఎవరినైనా బ్లాక్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లాక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ నంబర్‌ను అన్‌బ్లాక్‌ చేయాలంటే మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ ఆప్షన్‌తో కేవలం నంబర్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే చాలు స‌ద‌ర ప‌ర్సన్‌ అన్‌బ్లాక్‌ అవుతారు.

షేక్‌ టు రిపోర్ట్‌…
వాట్సాప్‌లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కోసారి మెసేజ్‌లు వెళ్లవు, రావు. వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఇన్ఫాం చేయాలంటే జస్ట్‌ మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ కావడంతో పాటు ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేస్తే చాలు.

ప్రైవేట్‌ రిప్లైస్‌..
వాట్సాప్‌లో మనం గ్రూప్‌ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది అందరికీ వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసిమెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ నొక్కితే చాలు. దీంతో గ్రూప్ లో మనం కావాల‌నుకున్న వ్యక్తికి మ‌న ప‌ర్స‌న‌ల్ మెసేజ్ వెళ్తుంది. అయితే ఈ కొత్త ఫీచర్లన్నీ ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న కొద్ది మంది యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ ఫీచ‌ర్ల‌ను ప్ర‌స్తుతం అంత‌ర్గ‌తంగా ప‌రిశీలిస్తోంది. త్వ‌ర‌లోనే వీటిని పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి తేనుంది

Comments

comments

Share this post

scroll to top