రైల్వే వ్యవస్థ లో ముగ్గురు మొనగాళ్ళు. ఎందరివో మాన,ప్రాణాలు కాపాడిన తెర వెనుక వీరులు.

ఈ మద్యకాలంలో మన రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు పేరు ప్రసార మాద్యమాల్లో చాలా ఫేమస్ అయిపోయింది. రైలులో ప్రయాణిస్తూ ఇబ్బందులకు గురైన ప్రయాణికులు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ కు వేగంగా స్పందిచంతో ఈయన పేరు ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.  ఈ ట్వీట్స్  ఆధారంగా చాలా మంది ప్రాణాలను, మానాలను కాపాడింది భారతీయ రైల్వే వ్యవస్థ. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలను, ట్రైన్ లో దొంగతనం చేయాలని తచ్చాడుతున్న చోరులను కేవలం ..ప్రయాణికులు చేసిన ఒక్క ట్వీట్ తో పట్టుకుంటున్నారు మన రైల్వే పోలీసులు.

అయితే దీని వెనుక ఇప్పటి వరకు బయటికి తెలియని  ముగ్గురు యువకులున్నారు. ఈ వర్క్ అంతా , రైల్వే మంత్రిత్వ శాఖ బిల్డింగ్ లోని నాల్గువ అంతస్తులో  రూం నెం 454 లో జరుగుతుంది.ఇప్పుడు వారి గురించి  తెలుసుకుందాం.

RAILWAY

1. అనంత్ స్వరూప్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. (ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు)
1992 ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ బ్యాచ్ అధికారి.ఈయన కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాద్యతలు నిర్వర్తిస్తుంటాడు.
2.హసీన్ యాదవ్:(ప్రత్యేక అధికారి)
మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన హాసీన్ యాదవ్, 2003లో ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ లో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఐఐఎం లో ఎంబిఏ పూర్తిచేసి,ఆస్ట్రేలియాలో మెక్కిన్సే కంపెనీలో కన్సల్టన్సీగా పనిచేశాడు.
3. వేద్ ప్రకాష్: డైరక్టర్ (సమాచారం మరియు ప్రచారం)
1998లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ అధికారి బ్యాచ్ అయిన వేద్ ప్రకాష్, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలా ప్రాబ్లం చేయాలో బాగా తెల్సిన అధికారి.ఇక పూర్తిగా ఈయన నేతృత్వంలోనే రైల్వే సోషల్ మీడియా నడుస్తోంది.
ఈ ముగ్గురు నేతృత్వంలో రైల్వే సోషల్ మీడియా నడుస్తోంది. ఎలాంటి చిన్న సమస్యలు ఎదురైనా క్షణాలలో సాల్వ్ చేస్తారు. ట్విట్టర్ ద్వారానే ఇక్కడ సిస్టం నడుస్తోంది. ప్రతిరోజూ దాదాపుగా ఇండియన్ రైల్వేకు 5000 పైగా ట్వీట్స్ వస్తాయట. అందులో 30% మంది రీట్వీట్ చేస్తుంటే, మరికొందరు కామెంట్స్ కూడా తెలుపుతున్నారు. ఇక ఈ ట్విట్టర్ లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా ఎప్పుడు యాక్టివ్ గా  ఉంటారట. ప్రతిరోజూ వచ్చిన మేజర్ ఇష్యూలను వారితో చర్చించడం, అలాగే ఎలాంటి సమస్యను ఎలా డీల్ చేస్తున్నారో ప్రతిరోజూ ఒక నివేదిక కూడా ఇస్తాడట.
ఇక ఈ నేతృత్వం అంతా బయట వ్యక్తులకు ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ సంస్థలు ఇస్తారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నవారిని ఇందులో శిక్షణ ఇప్పిస్తూ కొత్త విషయాలను తెలుపుతారు. విదేశీ వ్యవహారాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి అనుగుణంగా శిక్షణ ఉంటుందట.  ఇందులో మూడు భాగాలుగా షిఫ్ట్ లు వేసుకొని రైల్వే సోషల్ మీడియా అధికారులు పనిచేస్తున్నారు. ఉదయం గం.6 నుండి మ.గం 2, మ.గం.2 నుండి రా.గం10, రా.10 నుండి ఉ.గం6 వరకు పనివేళలు ఉంటాయి. లాస్ట్ షిఫ్ట్ అనంత్ స్వరూప్ బ్యాచ్ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏ సమస్య వచ్చినా మొత్తం రెస్పాన్సిబిల్టీ అతని టీమ్ దే.
మన ఇండియన్ రైల్వే ను ట్విట్టర్ 7,75, 000 మంది ఫాలో అవుతున్నారు. మన ఇండియన్ రైల్వే ట్విట్టర్ ఐడీ @RailMinIndia

Comments

comments

Share this post

scroll to top